కరోనా ప్రభావం తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఏప్రిల్14వరకు నేషనల్  వైడ్ గా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటికి రావొద్దని కరోనా పై రెండో సారి జాతినుద్దేశించి చేసిన ప్రసంగం లో మోదీ పేర్కొన్నారు. దాంతో ప్రస్తుతం దేశమంతటా లాక్ డౌన్ అమలవుతుంది. ఇక ఇప్పటికే  కరోనా అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. ముఖ్యంగా మహారాష్ట్ర ,కేరళ లో ఈవైరస్ పంజా విసురుతుండగా తాజాగా తమిళనాడు లో కూడా రోజు రోజు కి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
 
నియంత్రణ లో భాగంగా  తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కొద్దీ సేపటి క్రితం సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు అందరిని పాస్ చేయాలని విద్యాశాఖ ను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల కు ఇది వర్తిస్తుందని సీఎం వెల్లడించారు. దాంతో పరీక్షలు లేకుండా విద్యార్థులు పాస్ కానున్నారు. ఇదిలావుంటే ఈ ఒక్క రోజే తమిళ నాడు లో ఇప్పటివరకు 5 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు ఇండోనేషియా కు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం ఇప్పటివరకు  తమిళనాడు వ్యాప్తంగా 23 కేసులు నమోదయ్యాయి. 
 
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తెలంగాణ లో 39 కేసులు నమోదయ్యాయి అయితే ఈరోజు తెలంగాణ లో మధ్యాహ్నం వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం హర్షించదగ్గ విషయం. కాగా లాక్ డౌన్ ను రాష్ట్ర సర్కార్ సీరియస్ గా అమలు చేస్తుంది సరైన కారణం లేకుండా రోడ్ల మీదకు ఎవరైనా  వస్తే  పోలీసులు లాఠీలకు పనిచెప్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: