ఓ వైపు ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంటే.. మరోవైను ఉగ్రవాదులు తమ పైశాచిక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు.  సిక్కుల ప్రార్థనా మందిరమైన గురుద్వారాలో ఉగ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గత కొన్ని రోజులుగా ఉగ్రవాద చర్యలు ఎక్కడా జరగలేదు.. ప్రపంచ దేశాలన్ని కరోనా లాంటి పెను భూతం గురించి బెంబేలెత్తిపోతుంది.  ఈ సమయంలో కాబూల్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.  దైవ ప్రార్థన చేస్తున్న సిక్కులపై దారుణంగా కాల్పులు జరిపారు.  స్థానిక షోర్ బజార్‌లో ఉన్న గురుద్వారాలో ఈ ఉదయం సిక్కులు ప్రార్థనలు చేస్తుండగా సాయుధులైన కొందరు ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించారు. ప్రార్థనలో ఉన్నవారిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.

 

దాంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే ఈ ఉగ్రవాదులు గురుద్వారలోకి ప్రవేశించిన కాల్పులు జరిపిన సమయంలో 150 మంది ప్రార్ధన చేస్తున్నట్లు తెలుస్తుంది. చాలా మంది ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయాలపాలైనట్లు సమాచారం.  సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కాల్పులు జరిపింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐసిస్) ప్రకటించింది.  మొన్నటి వరకు తమ ఉనికి లేదని భావిస్తున్న సమయంలో నేడు ఈ దుర్మార్గులు రెచ్చిపోయారు.. దారుణమైన కాల్పులు జరిపారు. 

 

కాగా, గురుద్వారాపై ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో పోరాడుతున్న వేళ ఇలాంటి దాడులు క్రూరమైనవని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో దేశాలు కరోనా బీభత్సానికి కృంగిపోతుంటే.. ఇలాంటి దారుణమైన చర్యలకు ఉగ్రవాదులు పాల్పపడటం అన్ని దేశాలవారు తీవ్రంగా ఖండిస్తున్నారు.   ఇదిలా ఉంటే కాల్పులు జరిపింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐసిస్) ప్రకటించడం పై అన్నిదేశాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: