ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఈరోజు మధ్యాహ్నానికి కరోనా వైరస్ కేసుల సంఖ్య 4.23 లక్షలకు పెరిగింది. దీంతో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఇటలి కోవిడ్ మహమ్మారి బారిన పడి విలవిల్లాడుతుంది. ఇప్పుడు ఆ దేశ పరిస్థితి మృత్యువుకి కాళ్ళు చాపినట్లుంది. ఇక ఇటలీలోనే కాక ఫ్రాన్స్, స్పెయిన్, అమెరికాల్లోనూ వైరస్ భాదిత సంఖ్యలు పెరుగుతున్నాయి. ఇప్పుడు కరోనా కేకులు ఎక్కువగా ఉన్న దేశాలుగా చైనా ( మొదటి స్తానం), ఇటలీ (రెండవది), ఇక మూడవది అమెరికాగా నిలిచింది. ఇప్పటి వరకు అమెరికాలో 54 వేల మందికి వైరస్ సోకగా., 784 మంది వారి ప్రాణాలను విడిచారు. ఇక ఈ వైరస్ ప్రతాపాన్ని చుసిన ట్రంప్ ఏం చేయాలో తెలియక ఆందోళన పరిస్థితుల్లో చిక్కుకున్నారు. అసలు ట్రంప్ మొదట్లో ఈ వైరస్ తీవ్రత ఇంత ఉంటుందని పట్టించుకోలేదు. ఒకవేళ అమెరికాలో ఇలా రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతే మాత్రం చైనా, ఇటలీ దేశాలను మించిపోతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదట్లో ఈ కేసుల పై సరియైన శ్రద్ధ తీసుకుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదని కొందరి భావన.

 

కరోనా వైరస్ చైనా వలనే వ్యాప్తి చెందిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నాడు. అయితే.. ఇప్పుడు అమెరికాలో ప్రధానంగా న్యూయార్క్‌ నగరంలో విజృంభణం సృష్టిస్తోంది. ఇదిలా కొనసాగితే మాత్రం న్యూయార్క్‌ లో పరిస్థితి చేజారిపోతుందని చెప్పవచ్చు. కోవిడ్ విస్తరించకుండా దాదాపు న్యూయార్క్ నగరాన్ని లాక్ డౌన్ చేశారు. వచ్చి పోయే ప్రయాణికులను 14 రోజులపాటు క్వారంటైన్‌ లో ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచిస్తోంది. నెల క్రితం రాష్ట్రాల వారీగా నమోదయిన కేసులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్. అప్పుడు విస్తరించకుండా ఏదన్నా నియమాలను పాటిస్తే అమెరికా పరిస్థితి ఇలా ఉండేది కాదంటున్నారు.

 

ఈ నెల రోజులలోనే అమెరికాలో కేసుల సంఖ్య పెరిగి మూడో స్థానంకి చేరుకుంది. దీంతో అమెరికా ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తుంది. కరోనాను ఒక సాధారణ ఫ్లూ లాగ భావించిన ట్రంప్ అదే తగ్గిపోతుందని ఎలాంటి అవగాహన, జాగ్రత్తలు పాటించలేదు. దింతో పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది. ఇక భారత్ లో కూడా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌‌ డౌన్ విధించింది.

 

మోదీ ఈ నిర్ణయాన్ని అమలు చేయకపోతే భారత్ పరిస్థితి అయోమయంగా ఉండేది. మరణాల సంఖ్య లక్షలను దాటి కోట్లలో ఉండేది. మనది జన సాంద్రత ఎక్కువగా కలిగిన దేశం కాబట్టి మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారనే భావన వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: