ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కరోనాను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా ను అరికట్టేందుకు ఇప్పటికే లాక్ డౌన్ చేస్తున్న విషయం తెలిసిందే.  దేశంలో ఇప్పటివరకు మొత్తం 562 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.  ఇప్పడు దేశం భద్రంగా ఉండాలంటే ప్రతి పౌరుడు జాగ్రత్త వహించాలని.. ఇందుకు వైద్యులు, పోలీసులు మాత్రమే అలర్ట్ గా ఉంటే సరిపోదని ప్రతి పౌరుడు కూడా తమ వంతు బాధ్యతగా ఇంటి పట్టున ఉండాలని అంటున్నారు విజయసాయి రెడ్డి. అయితే 'కరోనా మిగతా వ్యాధుల్లాంటిది కాదు.

 

ముందస్తు లక్షణాలు కనిపించకుండానే ఒకరి నుంచి అనేక మందికి వ్యాపిస్తుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా సమాజానికి, కుటుంబానికి నష్టం చేసినవారమవుతాం. 21 రోజుల లాక్ డౌన్ ను అంతా మనస్ఫూర్తిగా పాటించాలి. ఇదొక అవిశ్రాంత పోరాటం' అని ట్వీట్ చేశారు. ఇప్పటివరకు 50 మంది కరోనా బాధితులు కోలుకున్నారని వెల్లడించింది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం లో పాజిటివ్ వచ్చిన యువకుడితో కలిసి ఉన్న మరో ఇద్దరికి కరోనా వచ్చినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది.

 

భద్రాద్రి కొత్త గూడానికి చెందిన 57 ఏళ్ల వ్యక్తికి, మరో వృద్ధురాలికి కరోనా సోకినట్లు వివరించింది.  ఇప్పటి వరకు భారత్ లో పది మరణాలు సంబవించాయి.  రోజు రోజుకీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. లుగు ప్రజందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు. కరోనా విపత్తుపై ప్రజాయుద్ధం కొనసాగుతున్న ఈ తరుణంలో మనవంతు కర్తవ్యం నిర్వర్తించాలి. గడప దాటకుండా ఈ మహమ్మారిని అంతం చేద్దాం. కరోనాపై పోరులో ప్రభుత్వానికి సహకరిద్దాం' అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: