కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇండియా చేస్తున్న కృషి, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయమని కోవ్‌-ఇండ్‌-19 భారత మేధావులు, డేటా సైంటిస్టుల సముదాయం కితాబిచ్చింది. మొన్నటి ఆదివారం జనతా కర్ఫ్యూను దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఎంతో సంతోషంగా ప్రజలను ధన్యవాదాలు తెలిపారు. అలాగే కరోనాను పూర్తిగా కట్టడి చేయడానికి మరింత సమయం కావాల్సి ఉందని.. ఇంటి గడప దాటకుండా కరోనా రక్కసిపై విజయం సాధిద్దామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వారణాసి ప్రజలు దేశానికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. అందరి లక్ష్యం ఇల్లే కావాలని, సామాజిక దూరాన్ని అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఈ మహమ్మారిపై యుద్ధం చేయాల్సిందేనన్నారు.

 

మహాభారత యుద్ధాన్నే 18 రోజుల్లో జయించామని, కరోనాను 21 రోజుల్లో జయించలేమా? అని ప్రశ్నించారు. ఈ విపత్కర సమయంలో అందరం కలిసి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఐకమత్యంగా కరోనాను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. 21 రోజుల తర్వాత కరోనా మహమ్మారిపై విజయం సాధించబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు.  ప్రజలు ఇప్పుడు ఎంతో ధైర్యంగా కరోనాపో యుద్దం చేస్తున్నారని.. ఇదే స్ఫూర్తి కొంత కాలం కొనసాగించాలని ఆయన కోరారు.  కరోనా వైరస్ ని ఎవరూ అంత తెలిగ్గా తీసివేయకూడదని అన్నారు. 

 

కరోనా వ్యాప్తిని అరికట్టడం ఇప్పుుడు మన ముందు ఉన్న ప్రధాన సమస్య అన్నారు. అయితే ఇందుకోసం ప్రతిభారత పౌరుడు విధిగా తన కర్తవ్యాన్ని పాటించాలని.. బయట అస్సలు తిరగవొద్దని అన్నారు. అందరి లక్ష్యం ఇల్లే కావాలని, సామాజిక దూరాన్ని అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.  కాగా, కరోనా ప్రభావం వల్ల 600 కేసులు నమోదు అయ్యాయి.. పది మంది కరోనా ఎఫెక్ట్ వల్ల మరణం సంబవించింది.  ప్రపంచ వ్యాప్తంగా 16 వేల వరకు మరణాలు సంబవించాయని వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: