తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఇటీవల జైలుకు వెళ్లి విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. భూ కబ్జా విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ డ్రోన్ కేసులో ఇరుక్కుపోయిన రేవంత్ రెడ్డి ఇటీవల రిలీవ్ అయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో మొదటి నుండి రేవంత్ రెడ్డి టీడీపీ లో ఉన్నా గానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న టార్గెట్ మాత్రం కెసిఆర్ నే చేస్తూ పొలిటికల్ కెరియర్ కొనసాగిస్తూనే రావడం జరిగింది. రాజకీయంగా కేసీఆర్ ని ఇబ్బందులపాలు చేయాలని అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రజాక్షేత్రంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఇటీవల వాతావరణం చల్లబడింది. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చాక తన వైఖరిలో కాస్త వెనక్కి తగ్గినట్టు క్లియర్ కట్ గా కనబడుతున్నారు.

 

ఈ నేపథ్యంలో ఇటీవల జైలుకు వెళ్లిన రేవంత్ రెడ్డి కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి తెలియజేశారు. అదేమిటంటే తెలంగాణ రాష్ట్రంలో జైల్లో ఉంటున్న ఖైదీలను రిలీజ్ చేయాలని కోరారు. జైలు అధికారులు జైళ్లలోకి, బయటికి వస్తుంటారన్న రేవంత్, వారి వల్ల ఖైదీలకు కరోనా సోకే ప్రమాదం పొంచి ఉందన్నారు. అందువల్ల ఖైదీల విడుదల ఆలోచన చేయాలని కోరారు. ముఖ్యంగా, మహిళలు, వృద్ధుల పట్ల సానుకూలంగా స్పందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడటంతో, తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకోవాలి అంటూ విజ్ఞప్తి చేశారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 లక్షల మంది ఖైదీలు ఉన్నారన్న రేవంత్… అందులో 65 శాతం మంది ట్రయల్స్‌లో ఉన్నవారేనని చెప్పారు. శిక్ష కాలం ముగుస్తున్న వారిని, పెట్టీ కేసుల్లో అరెస్టయి జైల్లో ఉన్నవారిని విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోవాలని తన లేఖలో రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు మండిపడుతున్నారట. ఇప్పటికే నీవల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగింది ఆపమ్మా నీ హడావిడి అని అంటున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: