ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న కరోనా వైరస్ కు ఇప్పటికే 19 వేలమంది బాలి అయ్యారు. నాలుగు లక్షలమంది ప్రజలు ఈ కరోనా బారిన పడ్డారు.. కరోనా వైరస్ నాలుగు లక్షలమందికి పైగా సోకినప్పటికీ లక్ష మంది ఈ వైరస్ బారి నుండి బయటపడ్డారు.. అయినప్పటి ఈ కరోనా వైరస్ చల్లగా ఉండే ప్రదేశాల్లో అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. 

 

ఇటలీ వంటి దేశాల్లో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.. రోజుకు ఐదు నుండి ఆరు వందల మంది వరుకు ఈ కరోనా బారిన పడి మరణిస్తున్నారు. ఇంకా ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించడంతో ప్రజలంతా కూడా వణికిపోతున్నారు. దీంతో ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అంతం చేసేందుకు మొన్న ఆదివారం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. 

 

ఇక ఆరోజు సాయింత్రం తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రెస్ మీట్ పెట్టి రెండు తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ అన్నారు. మాట వినకుండా బయటకు వచ్చిన ప్రజలను లాఠీలతో ఉతికి పడేశారు.. ఇంకా ఆతరవాత రోజు నరేంద్ర మోడీ ప్రెస్ మీట్ పెట్టి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించాం అని చెప్పారు. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 

 

మేము ఇళ్లకు వెళ్ళాలిరా బాబు అని నగరాల్లో నివసించే ప్రజలు ఏడుస్తున్నారు. కానీ ఎవరిని వెళ్లనివ్వడం లేదు.. ఇంకా ఈ నేపథ్యంలోనే తీర్థ యాత్రలకు వెళ్లిన వృద్దులు అష్ట కష్టాలు పడుతున్నారు. తీర్థ యాత్రలకు వచ్చాము సామీ.. మమ్మల్ని ఇంటికి వెళ్లనివ్వండి సామీ.. ప్లీజ్ సామీ.. ఆకలేస్తుంది.. ఎక్కడైనా తిందాం అని చుసిన కుదరడం లేదు అంటూ తీర్థయాత్రలకు వచ్చిన వృద్దులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.. ఆలా తీర్థ యాత్రకు వెళ్లిన అనంతపురం జిల్లా వృద్దులు గోర్కపూర్ లో చిక్కుకుపోయారు.. తినడానికి తిండి.. తాగడానికి నీరు లేక కష్టాలు పడుతున్నట్టు మీడియాకు చెప్పి వాపోతున్నారు. వీరి పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: