ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య రోజు రోజుకి వేగంగా పెరిగిపోతుంది. దీంతో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా భారిన పడిన భాదితుల సంఖ్య 4.34 లక్షలు దాటింది. ఇకపోతే..  మరణించిన వారి సంఖ్య 20 వేలకు దగ్గరలో ఉంది. చైనాలో పుట్టి అక్కడ విలయ తాండవం చేసిన కరోనా ఇప్పుడు అదుపులోకి వచ్చింది. అయితే.. ఇప్పుడు వైరస్ ప్రభావం చైనాలో తగ్గు ముఖం పట్టి ఇతర దేశాలయిన ఇరాన్, ఇటలీ, స్పెయిన్, అమెరికా వంటి దేశాలలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండి అక్కడ ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్ వలన ఇప్పటివరకు అధికంగా మరణాలు సంభవించింది ఇటలీలోనే.. కానీ మొన్నటి వరకు మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశం చైనాగా ఉండేది. దీన్ని బట్టి అర్ధమవుతుంది కరోనా ఎంత తీవ్రంగా వ్యాప్తి చెంది మరణాలను చవిచూస్తోంది.

 

అయితే.. ఇప్పుడు తాజాగా స్పెయిన్ కూడా డ్రాగన్‌ ను దాటివేసింది. ఈ వైరస్ కారణంగా ఒక్క రోజులోనే 738 మంది చనిపోయారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. దీంతో స్పెయిన్ దేశంలో మరణాల సంఖ్య 3434 గా నమోదయింది. కోవిడ్ కారణంగా చైనాలో 3281 మంది చనిపోయారు. అలాగే ఇప్పటి వరకు ఇటలీలో మరణాల సంఖ్య 6800 దాటింది. 

 

కరోనాను అదుపులో పెట్టడానికి స్పెయిన్ తీవ్రంగా శ్రమిస్తోంది. దీని కోసం గాను 11 రోజులుగా ఆ దేశంలో లాక్‌ డౌన్ ను ప్రకటించారు. అయినా కూడా పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదు. వైరస్ ప్రభావం ఎక్కువగా స్పెయిన్ రాజధాని అయిన మ్యాడ్రిడ్ ప్రాంతంలో ఉంది. స్పెయిన్‌ లో ఇప్పటి వరకు మొత్తం 47,610 మంది కరోనా బారిన పడ్డారని,, అలాగే రోజు రోజుకి వైరస్ భారిన పడిన వారి సంఖ్య పెరుగుతుందని, అలాగే మృతుల సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

 

అలాగే ఆందోళన వ్యక్తం చేస్తోంది. స్పెయిన్ లో మంగళవారం నాటికి 12 వేల మందికిపైగా కోవిడ్ బారిన పడ్డారు. 
ఇంకా 1500 మందికి పైగా చనిపోయారు. రోజుకు 700 మంది వరకు చనిపోతున్నారు. శవాలను ఖననం చేయడానికి కూడా ఇబ్బంది తలెత్తుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: