జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బకు చంద్రబాబునాయుడుతో పాటు తెలుగుదేశంపార్టీ నేతలందరికీ నోళ్ళు పడిపోయినట్లే అనుమానంగా ఉంది. రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై రాష్ట్రప్రభుత్వం సిబిఐ విచారణకు సిఫారసు చేస్తు కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. మొన్నటి వరకూ ఏమో దమ్ముంటే  విచారణ జరిపించమని, సాక్ష్యాలుంటే చూపించమని, చర్యలు తీసుకోమని సవాళ్ళు మీద సవాళ్ళు విసిరారు.

 

సరే ఏదో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అడిగాడు కదా అని జగన్ కూడా ఏకంగా సిబిఐ విచారణకు రెడీ అయ్యాడు. ఎప్పుడైతే సిబిఐ విచారణకు జగన్  సిఫారసు చేశాడో అప్పటి నుండి చంద్రబాబు అండ్ కో నోళ్ళు మూతపడిపోయాయి.  కేంద్రానికి సిఫారసు చేసి ఇప్పటికి మూడు రోజులు అయినా చంద్రబాబు కానీ తమ్ముళ్ళు కానీ జగన్ నిర్ణయాన్ని ఎందుకు స్వాగతించటం లేదు ?

 

అధికారంలో ఉన్న ఐదేళ్ళల్లో ఆకాశమే హద్దుగా చంద్రబాబు అండ్ కో అవినీతితో చెలరేగిపోయిన విషయం అందరూ చూసిందే. ఇందులో భాగంగానే అమరావతి గ్రామాల్లో కూడా అందినకాడికి ఎవరిష్టం వచ్చినట్లు భూములను  దోచేసుకున్నారు. ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారమే చంద్రబాబు బ్యాచ్ 4070 ఎకరాలను పేదల నుండి దోచేసుకున్నారు. కారుచౌకగా కొట్టేసిన వేలాది ఎకరాల విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది.  

 

చంద్రబాబు హయాంలో పెరిగిపోయిన అమరావతి భూముల విలువ జగన్ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా పడిపోయింది లేండి. జగన్ ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చాడో అప్పటి నుండే అమరావతి ప్రాంతంలో ఆందోళనలు మొదలైపోయాయి. సుమారు 100 రోజుల పాటు చేసిన ఆందోళనలు చివరకు కొరోనా వైరస్ దెబ్బకు కకావికలమైపోయింది. ఈ విషయాలను పక్కనపెట్టేస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సిబిఐ విచారణకు ప్రభుత్వం సిఫారసు చేసిన విషయాన్ని మాత్రం చంద్రబాబు ఎక్కడా ప్రస్తావించటం లేదు. జగన్ సిఫారసుకు వ్యతిరేకంగా తెరవెనుక ఏమైనా పావులు కదుపుతున్నాడా అనే అనుమానం పెరిగిపోతోంది అందరిలో. చూద్దాం కేంద్రం ఏమి చేస్తుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: