మంగళవారం రోజు అనగా మార్చి 24న శాసనసభలో విశ్వాస పరీక్షలో నెగ్గి నాలుగో సారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు శివరాజ్ సింగ్ చౌహాన్. అయితే అంతకు ముందు అనగా మార్చి 20వ తేదీన కమల్ నాథ్ప్రెస్ మీట్ పెట్టి తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో కమల్ నాథ్ తో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు, ప్రభుత్వ అధికారులు ఇంకా చాలామంది హాజరయ్యారు. ఈ హాజరయిన వారిలో ఓ ఇరవై ఆరేళ్ల యువతి తండ్రి జర్నలిస్టు గా విధులను నిర్వర్తించారు. అయితే తాజాగా అతనికి కోవిడ్ 19 వ్యాధి ఉన్నట్లు పరీక్షలలో తేలింది. దాంతో ఇది తెలుసుకున్న చాలామంది ఆందోళనకు గురవుతున్నారు.



పూర్తి వివరాలు తెలుసుకుంటే... మధ్యప్రదేశ్ లోని ఓ టీవీ జర్నలిస్టు యొక్క 26 ఏళ్ల కూతురు ఇటీవల లండన్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చింది. ఐతే ఆమె ప్రభుత్వ సూచనల ప్రకారం... క్వారంటైన్ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోకుండా... నేరుగా భోపాల్ లోని తన ఇంటికి వెళ్ళిపోయింది. సామాజిక బాధ్యతగల ఆ యువతి తండ్రి కూడా ఆమెకి టెస్ట్ చేయించకుండా రెండు రోజులు ఆలస్యం చేశాడు. ఐతే మార్చి 20వ తేదీన ఆమెకు జ్వరం రాగా... హాస్పటల్ కు తరలించారు కుటుంబ సభ్యులు. హాస్పటల్లో పరీక్షలు చేయగా ఆమె నమూనాలో కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. దాంతో అప్రమత్తమైన వైద్యులు ఆమె ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉందో వారికి పరీక్షలు చేశారు. ఆ పరీక్షలో తండ్రికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.





కూతురు విదేశాలకి వెళ్లి వచ్చినా ఆమెకి పరీక్షలు చేయించకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి... మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ కి హాజరయ్యి అందరి ఆరోగ్యానికి ముప్పు తెచ్చాడని ప్రస్తుతం ఆ జర్నలిస్టుని అందరూ తిట్టిపోస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించే స్థాయిలో ఉండి దేశంలో కరోనా కేసులు పెరిగి పోయేలాచేసే ఈ చదువుకున్నవారిని ఎన్ని మాటలు అన్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్ట్ లు చేయించుకోండని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నెత్తీనోరు మొత్తుకుంటున్నా విదేశీయులలో గానీ విదేశాల నుంచి వచ్చిన భారతీయులలో కానీ ఏ మార్పు రావడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: