చైనాలో పుట్టిన కరోనా వైరస్ భూమి మీద మరణ తాండవం చేస్తుంది. యూరప్ మరియు అమెరికా దేశాలలో భయంకరంగా ఈ వైరస్ యొక్క ప్రభావం ఉంది. ఇటలీ నగరంలో కుప్పలు తెప్పలుగా శవాలు పడి ఉండటంతో ప్రస్తుతం ఆ దేశంలో ప్రజలు అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఎవరూ కూడా ఇంటి నుండి బయటకు రావడం లేదు. ఇప్పుడు అదే పరిస్థితి స్పెయిన్ లో నెలకొంది. భయంకరంగా స్పెయిన్ దేశం ప్రజెంట్ శవాలు గుట్టగా తయారయింది. మరణాల విషయంలో చైనా ని దాటిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో చైనాలో మరో కొత్త వైరస్ బయట పడినట్లు వార్తలు రావటం జరిగాయి. దాని పేరు హంటా వైరస్.

 

ఈ వైరస్ వల్ల ఇటీవల బస్సు లో ఒక మనిషి చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అదే టైంలో ఆ బస్సులో 32 మంది ఉండటంతో వాళ్లకి కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో రావటంతో దేశంలో ప్రజలంతా మరొక వైరస్ ఏంటి బాబు. ఇప్పుడే చచ్చిపోతున్నాం ఇంట్లో ఉండలేక, ఉద్యోగాలు లేక. బతికుండగానే చైనా వాళ్ల ఇంట్లో కూర్చో పెట్టి ఒక బాంబు కూడా దేశం పైకి వెయ్యకుండా చంపేటటు ఉన్నారు అంటు లబోదిబోమంటున్నారు. అయితే కరోనా వైరస్ కి మందు లేదు కానీ, హంటా వైరస్ కి మాత్రం మందు ఉందట.

 

ఎలుకల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెల్లడించింది. దీనివల్ల పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదని అంటున్నారు. అంటే ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో..ప్రభుత్వ అధికారులు కూడా ఏది పడితే అది,అడ్డమైన సోది చదివి భయపడకండి నిజం తెలుసుకోండి ముందు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా లో 21 రోజులు లాక్ డౌన్ విధించడంతో ….చాలా మంది ప్రజలు వార్తలు విని భయభ్రాంతులకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: