కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు ప్రజలను చైతన్య పరచడానికి గానూ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 21 రోజులు ఆయన లాక్ డౌన్ ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయ౦ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు అవుతుంది. ప్రజలు అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీనికి సహకరిస్తున్నాయి. ప్రజలు అందరూ కూడా స్వచ్చందంగా దీనికి సహకరిస్తున్నారు. ఎక్కడో ఒకరిద్దరు మినహా ఎవరూ బయటకు రావడం లేదు ఇప్పుడు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ మరో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధాని సహా కేంద్ర మంత్రులు ప్రధాని కార్యాలయ కీలక అధికారులు అందరూ కూడా ఇళ్ళ నుంచే పని చెయ్యాలని ఆలోచిస్తున్నారు. ప్రధాని గుజరాత్ లోని తన తల్లి దగ్గరకు వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు. ఈ మేరకు ఆయన నిర్ణయం వెల్లడించే అవకాశాలు కనపడుతున్నాయి. అదే విధంగా కేంద్ర మంత్రులు కూడా తమ తమ ఇళ్ళ నుంచి పరిపాలించే విధంగా మోడీ ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. డిజిటల్ ద్వారా పరిపాలన చెయ్యాలని చూస్తున్నారు. 

 

ఇందుకోసం ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చెయ్యాలని చూస్తుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే అన్ని రాష్ట్రాల మంత్రులు కూడా తమ ఇంటి నుంచే పరిపాలన చెయ్యాలని చూస్తున్నారు. దీనిపై మోడీ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా మోడీ తీసుకునే ఈ నిర్ణయం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మోడీ ఇంటి నుంచి పరిపాలిస్తే ప్రజలకు కూడా కాస్త ఉత్సాహం వస్తుందని వాళ్ళు కూడా ఇంటి నుంచి కదలకుండా ఉంటారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: