కరోనా విలయ తాండవం నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఓవైపు ఆ వ్యాధి ఎక్కడ తమకు అంటుకుంటుందో అన్న ఆందోళన ఓవైపు ఉంటే.. మరో వైపు తమ జీవనం ఎలా అన్నది మరో ఆందోళన. ఈ లాక్ డౌన్ ఎంత కాలం ఉంటుంది. ప్రస్తుతానికి 21 రోజులు అని మోడీ చెప్పినా.. 21 రోజుల్లో కంట్రోల్ అయ్యి సాధారణ పరిస్థితి వస్తుందా అన్నది అనుమానమే.

 

ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ప్రజలకు అండగా ఉండాలి. భరోసా కల్పించాలి. కానీ ఏపీ మాజీ సీఎం చెప్పినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వల్ల ఇండియాలో ఇవరై లక్షల నుంచి ఏభై లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని చంద్రబాబు అన్నట్టు వార్తలు వచ్చాయి. అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్శిటీ లోని ఈ వ్యాధుల పరిశోధన కేంద్రం అంచనా వేసిందని ఆయన చెప్పినట్టు తెలిసింది.

 

 

అందులోనూ జనసాంద్రత ఎక్కువ గా ఉండే ఇండియాలో 20 నుంచి 30 కోట్ల మందికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని ఆ సెంటర్ అధ్యయనంలో తేలిందని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై భాద్యత వహించాలని, ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించాలని చంద్రబాబు అంటున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించారు.

 

 

నిజమే. ఈ సమయంలో నాయకులు ప్రజలను మేల్కొలపాలి.. అయితే అది భయపెట్టేలా ఉండకూడదు. ఏం పరవాలేదు.. మనం ఈ మహమ్మారిని జయించగలం అన్న దీమా జనంలో కల్పించాలి. అప్పుడే సమాజంలో కాస్త ధైర్యం, పోరాడే తత్వం వస్తాయి. అలా కాకుండా కేవలం భయపెడితే జనం.. ధైర్యం కోల్పోతే పరిస్థితి చేయి దాటి పోయే దుస్థితి తలెత్తుతుంది. ఈ సమయంలో నాయకుల్లో సమన్వయం అవసరం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: