దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు అందిన వివరాల ప్రకారం 606కు చేరింది. కరోనా భారీన పడి ఇప్పటివరకూ 10 మంది మృతి చెందారు. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మహారాష్ట్రలో 128 కేసులు, కేరళలో 109 కేసులు నమోదైనట్లు సమాచారం. తెలంగాణలో నిన్నటివరకూ 39 కేసులు నమోదు కాగా ఏపీలో 8 కేసులు నమోదయ్యాయి. 
 
ఇటీవల యూకే నుంచి హైదరాబాద్ కు వచ్చిన యువకుడికి కరోనా సోకింది. అనంతరం గాంధీలో చికిత్స పొంది కోలుకున్నాడు. ఫేస్ బుక్ ద్వారా తనకు ఎదురైన అనుభవాలను ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ప్రయాణానికి కొన్ని గంటల ముందు పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారని అందువల్ల థర్మల్ స్కానింగ్ నుంచి తప్పించుకున్నారని అన్నారు. 
 
తనకు కరోనా సోకింది కానీ తనలో కరోనా లక్షణాలు కనిపించలేదని చెప్పారు. కరోనాను చాలా సులభంగా ఎదుర్కోవచ్చని భావించవద్దని అన్నారు. వైరస్ సోకితే రోగ నిరోధక శక్తి తగ్గుతున్న భావన కలుగుతుందని.... మానసికంగా ధృడంగా ఉంటే కరోనాను జయించగలమని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారు కరోనా లక్షణాలు కనిపించనంత మాత్రాన కరోనా సోకిందని భ్రమపడవద్దని చెప్పారు. 
 
విదేశాల నుంచి వచ్చిన వారు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని... లేదంటే మీరు ఇతరుల్ని ప్రమాదంలోకి నెట్టినవారు అవుతారని చెప్పారు. ప్రభుత్వాన్ని థర్మల్ స్క్రీనింగ్ చేసి వ్యాధి లేదని నిర్ధారణకు రావద్దని చెప్పారు. అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులను ఆధీనంలోకి తెచ్చుకోవాలని... విదేశాల నుంచి వచ్చేవారిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు. క్వారంటైన్ లో ఉండకుండా బయట తిరిగేవాళ్లకు శిక్షలు, జరిమానాలు విధించాలని అన్నారు.        

మరింత సమాచారం తెలుసుకోండి: