ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్, ఎన్నో రకాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకవైపు వేల సంఖ్యలో ప్రాణనష్టం జరుగుతుండగా, మరోవైపు కోట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గండి కొడుతోంది. అది చాలదన్నట్లు, ఇపుడు దాని ప్రభావం.. కార్పొరేట్ ఉద్యోగుల మీద పడింది. అంతర్జాతీయంగా ఆర్ధిక వ్యవస్థ కుదేలవ్వడం వలన, ఆయా పరిస్థితులు సంభవించనున్నాయని సమాచారం.

 

ప్రపంచ వ్యాప్తంగా, వివిధ దేశాలలో లాక్ డౌన్ తో వాణిజ్యాలు క్లోజ్ అయ్యాయి. ఇటువంటి కారణాల చేత, రానున్న కొన్ని వారాల్లోనే లక్షల మంది, తమ ఉద్యోగాలు కోల్పోనున్నారని, ప్రపంచంలో నిరుద్యోగం ప్రబలుతుందని, ఆ తీవ్రత ఇండియాలో కూడా ఎక్కువగా ఉంటుందని... ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ అనాలసిస్ చేసింది. ముఖ్యంగా, లక్షల్లో హౌస్ హోల్డ్ ఉద్యోగాలు  కోల్పోతారని మూడీస్, ఈ సందర్భంగా  స్పష్టం చేసింది.

 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సుడిగుండంలో చిక్కుకున్న వేళ, ఈ వైరస్ ఇప్పుడు ఆసియాలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలతో పాటుగా... యూరప్, అమెరికా సహా అన్ని ఆర్ధిక వ్యవస్థలు... శాశ్వతంగా  మూతపడేలా చేసింది. ఉదాహరణకు... ఉద్యోగుల తొలగింపు, వ్యాపారాల్లో పెట్టుబడులు తగ్గడం, పదవీ విరమణలు స్తంభించడం... ఇలా పలు కారణాల వలన మరింత ఆర్ధిక సాధక బాధలు ఎదురయ్యే అవకాశం మెండుగా వుంది.

 

ఇక కరోనా బయటపడినప్పటికీ, ఇప్పటికి సరిపోల్చుకుంటే... ప్రపంచ జీడీపీ 2.6% నుండి, ఇపుడు ఏకంగా 0.4%కు పడిపోయిందని ప్రపంచ WTO అంచనా వేసింది. దీనికి కారణాలు అనేకం.. వాణిజ్యం, పర్యాటకం, విద్య, ఎంటర్టైన్మెంట్, రవాణా.. ఇలా ఆర్ధిక వ్యవస్థను బ్యాలన్స్ చేయగలిగే అత్యంత ముఖ్యమైన అంశాలు కుదేలు కావడం వలన ఈ పరిస్థితి దాపురించింది. అయితే.. ఆసియా ఆర్ధిక వ్యవస్థ కోలుకోవాలంటే వచ్చే ఏడాది వరకు వేచిచూడాల్సిందేనని, వేరే దారే లేదని... వాణిజ్య నిపుణులు అంచనా వేయడం, ఇపుడు కలవరపెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: