నిజంగా ఇది వింతే మరి. ఎందుకంటే కరోనా వైరస్ ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ గురించి తలపండిన సైంటిస్టులు కూడా కొత్తగా వింటున్నామని అంటున్నారు. దీనికి నివారణ లేదు, నియంత్రణ ఒక్కటే మందు అంటున్నారు. మొత్తం విశ్వాన్నే హడలెత్తిస్తూ పెను భూతంగా మారిన కరోనా వైరస్ గురించి ఎపుడో రాసిన  ఇంటర్ పుస్తకాల్లో ఉందిట. ఇది నిజంగా నమ్మలేకపోయినా నమ్మాల్సిన వార్తే.

 

ఇంటర్మీడియట్ జంతుశాస్త్రంలో పేజీ సంఖ్య 1072లో కరోనా వైరస్ గురించి పూర్తి సమాచారంతో పాటు కీలక సమాచారం ఉందిట. ఈ పుస్తక రచయిత డాక్టర్ రమేష్ గుప్తా. ఎన్నో పెద్ద పుస్తకాలు చదువుతూ ముందుకు పోయిన మనవాళ్ళు ఈ ఇంటర్ పుస్తకంలో జంతు శాస్త్రం గురించి ద్రుష్టి సారించలేదేమోలా ఉందని అంటున్నారు.

 

ఈ పుస్తకంలో కరోనా వైరస్ ని సాధారణ జలుబు కంటే చాలా ఎక్కువగా చెప్పుకొచ్చారు. దాని లక్షణాలు దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటివి ఉంటాయని అందులో పేర్కొన్నారు. దీనికి మందు అంటే జనాలకు దూరంగా ఉండడం. ఆ ఇన్ఫెక్షన్ ఎవరికీ సోకకుండా చేయడం వంటివిగా చెప్పుకొచ్చారు.

 

తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవడం, పరిశుభ్రం పాటించడం వంటివి చేయడం ద్వారా ఈ కరోనా వైరస్ నుంచి బయటపడగలమని కూడా అందులో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తూంటే చాలా కాలం క్రితమే ఈ కరోనా వైరస్ గురించి ఇంటర్ బుక్స్ లో ఉంటే ఇపుడు కొత్తగా సైటిస్టులు కనుగొనడంపైన కూడా  చర్చ సాగుతోంది.

 

ఏది ఏమైనా కరోనా  వైరస్ తీవ్రత  ఎక్కువగా ఉంది. అది తొందరగా జనసమూహంలో వ్యాపిస్తుంది. ఇన్ రోగ నిరోధక శక్తి లేని వారికి తొందరగా వ్యాపిస్తుంది. దాని వల్ల వారు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు పడతారు. ఆ మీదట ప్రాణాంతకంగా మారి చనిపోతున్నారు. మరి దీని మీద పరిశోధనలు ఇపుడు జరుగుతున్నాయి. ఇంకా చేయాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ పేరు మాత్రం మన ఇంటర్ పుస్తకాల్లో ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: