కరోనా.. ఇప్పుడు ఇది తప్ప మనిషికి వేరే ఆలోచన లేదు.. ఈ వైరస్ వచ్చిన వారు బ్రతికి బట్ట కడతారనే నమ్మకం కూడా లేదు.. మరి ఇలాంటి పరిస్దితుల్లో ఎవరికి వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి తగిన జాగ్రత్తలతో తమను, తమ కుటుంబాన్ని రక్షించుకోవడం తప్పా వేరే మార్గం కనిపించడం లేదు.. ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాల పరిస్దితులను చూస్తుంటే ఈ వినాశనం నుండి అసలు బ్రతికి బయటపడతామా అనే అనుమానం కలుగుతుంది.. ఇలాంటి పరిస్దితుల్లో కొందరు కొన్ని విధాలైన పద్దతులు, రక్షణ చర్యలు పాటిస్తూ ఉండటం వల్ల కొంత వరకైనా ఈ కరోనా నివారించవచ్చూ.. అవేంటో తెలుసుకుంటే..

 

 

కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న వేళ డాక్టర్లూ, నర్సులు, మీడియా... ఇలా అత్యవసర విభాగాల్లో పనిచేసేవారు నిత్యం ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. అటువంటి సమయాల్లో సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం కాస్త కష్టమైన పనే. దీని గురించి తెలిసినప్పటికి ఆచరించడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఇప్పటికే ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. ఆ మాటల్ని పెడచెవిన పెడుతున్నారు. అవసరం ఉన్నా, లేక పోయినా బయటి వ్యక్తులను కలుస్తూనే ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం మన దేశం కరోనా వ్యాధి సంక్రమణలో రెండవ దశలో ఉండగా, ఒకవేళ మూడవ దశలోకి వెళ్తే.. సమస్యను అదుపు చేయలేము. ఇటలీ కంటే మరణాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉంది.

 

 

ఇలాంటి పరిస్థితుల్లో.. కరోనా వచ్చిన వారిని గుర్తించినా వారు ఎవర్ని కలిసారో తెలుసుకోవడం కష్టంగా మారింది.. అందుకే ఇలాంటి ఇబ్బందులు కలుగ కుండా ఉండాలంటే  ఒక లాగ్‌ షీట్‌ నియమాన్ని పాటిస్తూ, అందులో ప్రతి రోజు ఎవరెవరిని కలిశారు.. ఎవరెవరితో మాట్లాడారు అన్న సమాచారాన్ని సోషల్‌ డిస్టెన్స్‌తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉండాలి.. ఇలా 30 రోజుల పాటు ప్రతి 15 రోజుల కొకసారి ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుంది.

 

 

ఇలా 3 రోజులు అయ్యాక.. మీరు ఎవరెవరిని కలిశారో వారి ఆరోగ్య వివరాలు తెలుసు కోవాల్సి ఉంటుంది. వారిలో ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే 104 నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలి. ఇలా బాధ్యతగా ప్రతీ పౌరుడు లాగ్‌ షీట్ నియమాన్ని పాటించడం ద్వారా ప్రతి రోజూ ఎంత మందిని కలుస్తున్నాము.. ఇలా చేయడం ఎంత వరకు మంచిది అనే విషయాలపై ఒక స్పష్టత వచ్చి సోషల్ డిస్టెన్సింగ్‌ విలువ తెలుస్తుంది... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: