బంధాల‌కి సంబంధాల‌కి పెద్ద‌గా ప‌ట్టించుకోని ఈ రోజుల్లో కూతురు మీద ప్రేమ‌తో ఓ తండ్రి ఏకంగా 2500కి.మీ. దూరం వెళ్ళిమ‌రీ కూతుర్ని క‌రోని భారి నుంచి త‌ప్పించి ఇంటికి తీసుకువ‌చ్చాడు. అదెలా అనుకుంటున్నారా. వివ‌రాల్లోకి వెళితే... వృత్తిరీత్యా ఆయ‌న ఒక డాక్ట‌ర్‌. వయసు 49 ఏళ్లు ఉండేది. జార్ఖండ్‌‌లోని బొకారో‌ పట్టణంలో. ఆయనకు 18 ఏళ్ల కుమార్తె ఉండేది. ఆమె చ‌దువు కోసం రాజస్థాన్‌లోని కోట పట్టణ్ణానికి వెళ్ళి అక్క‌డే చదువుకుంటోంది.  క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో అంద‌రూ హాస్ట‌ల్‌ని కాళీ చేసి వెళ్ళిపోయారు. దీంతో ఆమెకు ఏం చేయ‌వాలో అర్ధం కాక తండ్రికి ఫోన్ చేసి చెప్ప‌గా వెంట‌నే మ‌న‌సు క‌రిగిపోయి. కరోనా వైరస్ ప్రభావంతో తన కూతురు కోట పట్టణంలో చిక్కుకుపోతుందనే భ‌యంతో తండ్రి వెంట‌నే కారులో బ‌య‌లుదేరి  సోషల్ డిస్టెన్సింగ్ కోసం ఆయన ఎక్కడా కారును ఆపలేదు. కోట చేరుకోగానే తన కూతుర్ని తీసుకొని బయల్దేరాడు. ఎక్క‌డా బ్రేక్ అనేది ఇవ్వ‌కుండా అలా 50 గంటల్లో ఇల్లు చేరాడు. కోట, బొకరో పట్టణాల మధ్య దూరం 1250 కి.మీ. పైనే. రానుపోను 2500 కి.మీ. ఆయన ప్రయాణించారు.

 

అయితే న‌న్ను ఇంటికి తీసుకురావ‌డం కోసం మా నాన్న ఎంతో క‌ష్ట‌ప‌డ్డారంటూ నిజంగా సూప‌ర్‌డాడీ అని ఆయ‌న కూతురు మురిసిపోయింది. ఈ ప్రయాణాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె ఎంతో ఆనందంగా తెలిపింది. జార్ఖండ్‌‌లో బయలుదేరిన  ఆయన బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మీదుగా రాజస్థాన్‌లోని కోట పట్టణం చేరుకున్నారు. టైం వేస్ట్ కాకుండా కార్లోనే ఆహారం తీసుకున్నామని ఆయన తెలిపారు.

 

ఎక్క‌డా కూడా ఆప‌కుండా 50 గంటలపాటు ప్రయాణం చేసిన ఆ డాక్టర్ క‌నీసం ఆయ‌న రెస్ట్ కూడా తీసుకోకుండా...కరోనా ప్రభావంతో ఉన్న పేషంట్లుకి వైద్యం అందించ‌డం కోసం  వెంటనే డ్యూటీలో చేరిపోయారు. ఇక ఈ లాక్‌డౌన్ కారణంగా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయని, యూపీలో మీర్జాపూర్‌లో మాత్రమే కొద్ది సంఖ్యలో వాహనాలు, జనం కనిపించారని ఆయన తెలిపారు. పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన‌ తనిఖీలు చేస్తున్నారు కానీ.. వారికి మాస్కులు లేవని.. తాను తీసుకెళ్లిన కొన్ని మాస్కులు, శానిటైజర్లను వారికి ఇచ్చానని ఆయ‌న‌ తెలిపారు. ఎంతైనా మొత్తానికి ఒక సామాజిక ప‌ని చేశారు. అంతేకాక ఎంతైనా డాక్ట‌ర్ అనిపించుకున్నాడు ఆయ‌న‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: