ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పుడు దేశం మొత్తం కరోనా వైరస్ తీవ్రతకు చాలా ఇబ్బందులు పడుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడం ఎలా అనేది పాలకులకు అసలు అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ప్రపంచ దేశాలు అన్నీ కూడా కరోనా వైరస్ ని ఏ విధంగా కట్టడి చెయ్యాలి అనే దాని మీద తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మన దేశంలో కూడా కరోనా వైరస్ తీవ్రతను ఏ విధంగా అయినా సరే కట్టడి చెయ్యాలని భావిస్తున్నారు. ఇప్పటికే దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. 

 

మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఊహించని విధంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణాలో దాదాపు 40 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. దేశం అమలు చేస్తున్న లాక్ డౌన్ ని ప్రజలు అందరూ పాటిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జగన్ కీలక నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. తాను కూడా కరోనా కోసం పని చెయ్యాలని చూస్తున్నారు. ప్రజా ప్రతినిధులను పంపే విధంగా ప్లాన్ చేస్తున్నారు. 

 

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే ప్రజా ప్రతినిధులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అందరూ కూడా ముందుకి రావాలని వారు అందరూ ప్రజల కు సేవ చేయడమే కాకుండా... పోలీసులకు కూడా సహకరించాలని కెసిఆర్ సూచించారు. అలాగే ఇప్పుడు జగన్ కూడా ఆ నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు అందరికి ఆధెశాలు ఇవ్వదానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు అని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: