కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలోనే మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. లాక్ డౌన్ ని పొడిగించే యోచనలో కేంద్రం ఉంది. అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా ఇప్పట్లో అనుమతించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా లేదనే అంటున్నారు. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా సరే కరోనా కమ్మేయడం ఖాయమని అంటున్నారు. దీనితోనే కేంద్రం మరింత అప్రమత్తంగా, వ్యూహాత్మకంగా ముందుకి వెళ్తుంది. 

 

కరోనా వైరస్ అనేది తక్కువ అంచనా వేసే వైరస్ ఎంత మాత్రం కాదు. కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు 21 రోజులు లాక్ డౌన్ అని కేంద్రం చెప్పింది. కాని ఈ 21 రోజుల్లో అది అదుపులోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ముందు జనతా కర్ఫ్యూ అని ప్రజలను ఇళ్ళకు పరిమితం చేసిన కేంద్ర సర్కార్... ఇప్పుడు 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించారు. ఆ లాక్ డౌన్ ని మరింత కాలం పొడిగించడమనే దానిపై కేంద్రం సమాలోచనలు చేస్తున్నారు. దాదాపు మూడు నెలల పాటు దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించే యోచనలో కేంద్ర సర్కార్ ఉంది. 

 

ఈ నిర్ణయంపై ఇప్పటికే నేడు జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో కేంద్ర పెద్దలు చర్చించారు. ఈ నిర్ణయం పెంచితే దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత దిగజారే అవకాశాలు కనపడుతున్నాయి. దీనితోనే కేంద్ర పెద్దలు ఒకటికి పది సార్లు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా వైరస్ ఇప్పట్లో కట్టడి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలను త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: