కరోనా పేరు చెప్తేనే కంగారు పడిపోతున్నారు ప్రజలు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతి కేసులు రోజు రోజుకి పెరిగిపోవడంతో ఈ వైరస్ ఎప్పటి తగ్గు ముఖం పడుతుందోనని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఈ కరోనా ధాటికి తట్టుకోలేక హాహాకారాలు చేస్తున్నాయి. ఇటలీ లో ప్రజల పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యింది. బిక్కు బిక్కుమంటూ ఇళ్ళలో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. గుట్టలు గుట్టలుగా శవాలు నిండిపోతున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా నష్ట నివారణ చర్యలు చేపడుతోంది. ఇక భారత్ లో ఈ వ్యాధి బారిన పడిన వారు సంఖ్య మెల్ల మెల్లగా పెరుగుతోంది...ఈ వ్యాధి ని నిర్మూలించడానికి మెడిసిన్ కనిపెట్టే ప్రయత్నాలలో ప్రపంచ దేశాలు తలమునకలై ఉన్నాయి...ఈ క్రమంలోనే

IHG

భారత్ వైద్యులు కరోనా పాజిటివ్ కేసులని ఛాలెంజ్ గా తీసుకుని వారిని వైరస్ నుంచీ కాపాడారని, కరోనా పై తొలి విజయం సాధించారని ప్రింట్ సైట్ అనే వెబ్సైట్ లో ప్రచురించబడింది. అయితే కొత్త మంది కనిపెట్టి కరోనాని కట్టడి చేయలేదట. పాత పద్దతిలోనే పాత మందులని వాడుతూ కరోనాకి చెక్ పెట్టారట మన వైద్యులు. ఈ విజయం వాళ్ళు ఎలా సాధించారో ఇప్పుడు చూద్దాం.

IHG

ఇటలీ నుంచీ సుమారు 14 మంది టూరిస్ట్ లు భారత్ వచ్చారట. వారి 14 మందికి కరోనా టెస్ట్ లు చేయగా అందరికి పాజిటివ్ వచ్చింది. దాంతో వీరిని గుర్ గావ్ లోని వేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఈ కరోనా అంతు చూడాలని ఫిక్స్ అయిన వైద్యులు యతీన్ మెహతా, సుశీల కటారియా బాధితులని క్వారంటైన్ లో ఉంచి చికిత్స మొదలు పెట్టారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే భాదితులు అందరూ 50 ఏళ్ళ పైవారే.పైగా జబ్బు చాలా సులభంగా వారిపై దాడి చేసే అవకాశం ఉన్నా వైద్యులు వెనకడుగు వేయలేదు..

IHG

క్వారంటైన్ లో ఉంచే వారికి వచ్చే లక్షణాలని బట్టి వైద్యులు మెడిసిన్ ఇవ్వడం మొదలు పెట్టారు. పారసెట్మాల్ మాత్రలు, దగ్గు అరుకు మందులు,రోగ నిరోధక శక్తి పెరగడానికి మాత్రలు, వ్యాధి తీవ్రత ఎక్కువైతే యాంటీ వైరల్ డ్రగ్ లోపినావర్ దీనికి తోడు పరిస్థితిని బట్ట అజిత్రోమైసిన్ ఇచ్చారు. అలాగే అందరూ అనుకుంటున్నట్టుగా హైడ్రాక్సీ క్లోరో క్విన్ ఇచ్చారు..ప్రస్తుతం ఆ 14 మందిలో 11 మందిని డిశ్చార్జ్ చేశారు.70 ఏళ్ళు దాటి మరి ఇద్దరినీ త్వరలో రిలీజ్ చేస్తామని తెలిపారు. అయితే వారికి 70 ఏళ్ళు పై బడిన ఓ వృద్దుడి పరిస్థితి క్రిటికల్ గా ఉందని సదరు పత్రిక రాసుకొచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: