ఇప్పుడు ప్రపంచం అంతా ఋణపడి ఉండవలసింది మెడికల్ సిబ్బందికి.. రాత్రి పగలు అన్ని మరచి, కుటుంబాలను, కన్న వారిని వదిలి తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నిత్యం కరోనా పేషెంట్స్ సేవలో ఉంటున్న వీరికి ఏమిచ్చిన తక్కువే.. ఇలాంటి వారిని ఎంతగా గౌరవించాలంటే, మాటల్లో చెప్పడానికి పదాలు కూడ దొరకడం లేదు.. ఇక కరోనా రోగులకు వైద్యం చేయమని డాక్టర్లు, నర్సులు పక్కకు తప్పుకుంటే ఒక్క సారి పరిస్దితి ఊహించుకోండి లోకం ఎలా మారుతుందో..

 

 

ఇక మనకు జబ్బు వస్తే వైద్య సిబ్బంది సేవలు కావాలి.. కానీ వారికి మాత్రం మనం ఏ రకంగా ఉపయోగపడ వద్దు.. మనుషుల్లో ఉన్న స్వార్ధానికి ఇది నిదర్శనం.. ఇంత నీఛంగా ఆలోచిస్తున్నారు కొందరు.. అదేమంటే ఇలా తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ, ఎనలేని సేవలను అందిస్తున్న డాక్టర్ల విషయంలో కొందరు ఇంటి యజమానులు బాధ్యతారాహిత్యం గా ప్రవర్తిస్తున్నారట.. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది..

 

 

ఇక కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఢిల్లీ ఎయిమ్స్‌లోని వైద్యులు, తాము అద్దెకు ఉంటున్న ఇంటి యజమానుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. తాము అద్దెకు ఉన్న యజమానులకు తమ కారణంగా వైరస్‌ సోకుతుందేమోనన్న భయంతో తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నారట.. ఇక మరికొందరైతే బలవంతంగా వైద్యులతో ఖాళీ చేయించారట కూడా. ఈ విషయాలన్నీ స్వయంగా ఎయిమ్స్‌ మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. ఈ విషయంలో తమను ఆదుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి ఎయిమ్స్‌ రెడిసెంట్‌ డాక్టర్స్‌ ఆసోసియేషన్‌ లేఖరాసింది.

 

 

కాలనీల్లో తమ ప్రవేశాన్నీ స్థానికులు అడ్డుకుంటున్నారని లేఖలో వైద్యులు వాపోయారు. తమను ఖాళీ చేయనివ్వకుండా ఇంటి యజమానులకు ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు. నిజానికి ఇది ఎంత మూర్ఖత్వం.. మీకు రోగం వస్తే వారు కావాలి.. కానీ వారు మీ ఇంటిలో ఉంటే మీకు జబ్బులు వస్తాయా.. ఛీ మనుషులు అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా.. ముందు కరోనా కంటే మీ ఆలోచనలు మహా డేంజర్‌గా ఉన్నాయి.. అవి మార్చుకోండని నెటిజన్స్ కొందరు ఫైర్ అవుతున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: