ప్ర‌పంచాన్ని క‌రోనా కుదిపేస్తోంది. ఇట‌లీ, ఇరాన్ వంటి దేశాలు శ‌వాల దిబ్బ‌లుగా మారిపోతున్నాయి. దీంతో వారి నుంచి పాఠాలు నేర్చుకుంటున్న మిగిలిన దేశాలు చ‌ర్య‌లు ప్రారంభిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలోనూ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాం. అయితే, ఒక్క‌రోజు కూడా పూర్తిగా ఇంటికి ప‌రిమితం కాని స‌గ‌టు భా ర‌తీయులు ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌తో ఇక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎప్పుడు ఏ అవ‌కాశం వ‌చ్చినా బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌భుత్వాలు, పోలీసులు ఎన్ని ఆంక్ష‌లు పెడుతున్నా.. పెద్ద‌గా లెఖ్క చేయడం లేదు.



రాష్ట్రంలో లాక్‌డౌన్ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. పట్టణాలు, నగరాల్లో వాహనదారులు భారీగా రోడ్లపైకి వచ్చారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి వెనక్కు పంపించారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కేసు లు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధించారు. విజయవాడలోని రైతుబజార్లు వినియోగదా రుల తో కిటకిటలాడాయి. తూర్పుగోదావరి జిల్లాలో 144సెక్షన్‌ విధించినా ప్ర‌జ‌లు లెక్క‌చేయ‌లేదు. మంగ ళవా రం 188సెక్షన్‌ కింద జిల్లావ్యాప్తంగా 1,500 కేసులు నమోదు చేయడంతో పాటు వాహనదారుల నుంచి రూ.7 లక్షల జరిమానా వసూలు చేశారు. ప్రకాశం జిల్లాలోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగింది.



మ‌రి పేద్ద పేద్ద చ‌దువులు చ‌దివినోళ్లున్న‌ మ‌న పట్నం, న‌గ‌రంల‌లో ప‌రిస్థితి ఇలా ఉంటే.. ప‌ల్లెటూర్ల‌లో ప‌రిస్థితి ఎలా ఉంది? అక్క‌డ ఏమ‌న్నా.. లాక్‌డౌన్‌ల‌ను పాటిస్తున్నారా.. లేదా? అనే సందేహం వ‌స్తుంది. అయితే, వ్యక్తిగ‌త చైత‌న్యం అనాలో.. ప్ర‌భుత్వాలు పెట్టిన ఆంక్ష‌ల‌ను పాటించాల‌నే క‌ట్టుబాటు అనాలో.. లేక క‌రోనా వైర‌స్‌ను త‌రిమి కొట్టాల‌నే దీక్ష అనాలో ఏదైతేనేం.. ప‌ట్నాలు, న‌గ‌రాల జ‌నాభా క‌న్నా కూడా ప‌ల్లెటూరు ప్ర‌జ‌లు ఈ లాక్ డౌన్‌ను సంపూర్ణంగా నూటికి నూరు శాతం పాటిస్తున్నారు. అంతేకాదు, ప్ర‌భుత్వాలు కూడా చేయ‌లేని విధంగా ఊళ్ల‌కు ఊళ్ల‌ను నిర్బంధించి గ్రామ పొలిమేర్ల‌లోనే క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.



ప్ర‌తి ఇంటికీ శానిటైజర్ బాటిళ్ల‌ను పంపిణీ చేసుకుంటున్నారు. నిర్ణీత స‌మ‌యాల‌ను పెట్టుకుని అప్పుడు మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న ప‌నులు చేసుకుంటున్నారు. దీంతో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు ప‌ల్లెటూరు ప్ర‌జ‌లే పాఠాలు నేర్పుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి ఇప్ప‌టికైనా ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లోని ప్ర‌జ‌లు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉండి.. క‌రోనాను త‌రిమికొట్టాల‌ని ఆశిద్దాం!

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: