కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రెండు  తెలుగు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉన్న విషయం తెలిసిందే. కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయితే ఈ లాక్ డౌన్ ప్రభావం వల్ల హైదరాబాద్ లో ఉన్న ఏపీ విద్యార్థులు, ఉద్యోగులకు కష్టాలు మొదలయ్యాయి. ఎక్కడకిక్కడ హాస్టళ్లు మూసివేయడంతో విద్యార్థులు రోడ్ల మీదకొచ్చేసారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కాస్త కనికరించి, విద్యార్థులకు సొంత ఊర్లకు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు. సొంత వెహికల్స్ ఉన్నవారు వెళ్లొచ్చని, స్థానిక పోలీస్ స్టేషన్స్ విద్యార్థులకు పర్మిషన్ పత్రాలు ఇచ్చారు.

 

ఇప్పటికే పర్మిషన్ పత్రాలు తీసుకున్న వారు సొంత వాహనాల్లో బయలుదేరారు. ఇంకా వేలమంది పర్మిషన్ పత్రాలు కోసం పోలీస్ స్టేషన్ల దగ్గర క్యూలు కట్టారు. ఇదే సమయంలో సొంత ఊర్లకు వచ్చేవారికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి రావొద్దని, కరోనా వ్యాప్తి ఎక్కువున్న నేపథ్యంలో విద్యార్థులకు పర్మిషన్ ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానికి కోరింది.

 

అయితే ఏపీ ప్రభుత్వం అనుకున్న విధంగానే తెలంగాణ నుంచి వస్తున్న వారిని ఏపీలోకి అడుగుపెట్టనివ్వడం లేదు.తెలంగాణ, ఏపీ బోర్డర్ లో వేలల్లో వెహికల్స్ ఆపేస్తున్నారు. ఎలాంటి పరిస్థితిల్లోనూ ఏపీలోకి అడుగుపెట్టనివ్వమని పోలీసులు తెగేసి చెప్పేస్తున్నారట.

 

ఇక దీంతో అనేక మంది టోల్ గేట్స్ దగ్గర గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. దీని బట్టి చూసుకుంటే కరోనా వ్యాప్తి చెందకుండా జగన్ ప్రభుత్వం చాలా కఠినమైన రూల్స్  పాటిస్తుంది. ఇలా ప్రభుత్వం వ్యవహరించడానికి కారణం లేకపోలేదు. తెలంగాణతో పోలిస్తే, ఏపీలో కరోనా కేసులు చాలా తక్కువ.  ప్రస్తుతం ఏపీలో 8  మందే కరోనా బాధితులు ఉన్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో ప్రజలు ఏపీలోకి వస్తే, వారిలో కరోనా ఎవరికైనా ఉంటే పరిస్థితి చాలా దూరం వెళ్ళిపోతుంది. అందుకే జగన్ ప్రభుత్వం ఇంత కఠినంగా ఉండాల్సి వస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: