ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలకు పాకిన విషయం విదితమే. ఇప్పటికే పలు పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. అనుమానిత కేసులు మాత్రం చాలానే నమోదయ్యాయి. అయితే.. ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్ కేసుల గురించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ మద్య   కరోనా విషయంలో కొత్త కొత్త ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్న జ్వరం వచ్చినా.. దగ్గినా కూడా కరోనా వచ్చిందంటూ వాట్సప్‌లో వార్తలు వైరల్ చేస్తున్నారు కొందరు. ఈ క్రమంలోనే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేసినవారిని గుర్తించారు పోలీసులు.

 

తెలంగాణలో రెండు జిల్లాల్లో ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  దేశంలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. నేటి సాయంత్రానికి దేశవ్యాప్తంగా 606 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే, 10 మంది మృతి చెందినట్టు తెలిపింది.  కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఇప్పటి వరకు ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం ఊరటనిచ్చే విషయం. మహారాష్ట్రలో అత్యధికంగా 128, కేరళలో 109 కేసులు నమోదయ్యాయి. ఏపీలో 9, తెలంగాణలో 25 కేసులు నమోదయ్యాయి. 

 

ఇప్పటి వరకు భారత దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  తెలంగాణలోని 25 మంది బాధితుల్లో 10 మంది విదేశీయులు కావడం గమనార్హం.  మొత్తానికి 2020, మార్చి 25వ తేదీ గురువారం సాయంత్రం వరకు ఒక్క కేసు కూడా రికార్డు కాలేదు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు లాక్ డౌన్ అములు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: