కరోనా వైరస్ మహమ్మారి భయంకరంగా భూమిమీద మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. వైరస్ వల్ల చాలా దేశాలు ప్రస్తుతం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాయి. ముఖ్యంగా ఇటలీ, అమెరికా, స్పెయిన్ ఇలాంటి దేశాలలో వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. ఇండియాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా తక్కువ భూభాగంలో ఎక్కువ జనాలు కలిగిన దేశం పైగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన దేశం కావడంతో ప్రధాని మోడీ ముందు జాగ్రత్తలు తీసుకుంటూ లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.

 

ఇదిలా ఉండగా పాపులర్ సింగర్ కనికా కపూర్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. లండన్ నుంచి లక్నో కి వచ్చిన ఈ హాట్ సింగర్ విమానాశ్రయంలో కరోనా వైరస్ పాజిటివ్ అని వైద్యులు చెప్పినా గానీ...వైద్యులు మరియు పోలీసుల కళ్లుగప్పి  పార్టీ కి అటెండ్ కావడంతో ఆమెపై ఉత్తరప్రదేశ్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో యూపీ సర్కార్ ఆమెకు సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ లో ఉంచి ప్రత్యేకంగా చికిత్సను అందిస్తుండగా...ఆసుపత్రిలో పోలీసులపై సీరియస్ అయ్యింది. దీంతో పిచ్చ కోపం వచ్చిన పోలీసులు ఆమెకు సీరియస్ వార్నింగ్ హాస్పిటల్లో ఇచ్చారట.

 

ఒక పక్క చికిత్స తీసుకుంటున్న చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉండటంతో పాపులర్ సింగర్ కనికా కపూర్ పై మర్డర్ కేసు పెట్టడానికి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కరుణ పాజిటివ్ అని తెలిసిన గాని ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరించినందు వల్ల ఆమెపై మర్డర్ కేసు పెట్టి జైల్లో పెట్టాలనుకుంటున్నారట. దేశమంతటా సామాన్యుడు ఇంటిలో ఉంటే ఒక సెలబ్రిటీ స్థానంలో ఉన్న ఈ సింగర్ ఈ విధంగా వ్యవహరించడం పట్ల సోషల్ మీడియాలో బండబూతులు నెటిజన్లు తిడుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: