కరోనా వైరస్ రోజు రోజుకి పడగ విప్పి మనుషులను చంపే విధంగా తీవ్ర రూపం దాలుస్తున్న ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. యూరప్ మరియు అమెరికా అదేవిధంగా స్పెయిన్ ప్రాంతాలలో వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. ఇటలీ దేశం లో మరణం తాండవం చేస్తుంది. దేశంలో ఎక్కడ చూసినా శవాలు కుప్పలు తెప్పలుగా మారిపోయాయి. మరోపక్క ఇదేవిధంగా స్పెయిన్ దేశం కూడా తయారయింది. ఉన్న కొద్ది స్పెయిన్ దేశం ఇటలీ దేశం గా మారే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మరణాల సంఖ్య 20 వేల దాకా రావడం జరిగింది.

 

దీంతో కరోనా వైరస్ కి మందు లేకపోవటంతో కట్టడి చర్య గట్టిగా చేపడితే కొద్ది వరకు ప్రజలను కాపాడుకునే వాళ్ళం అవుతాము అంటూ భూమి మీద ఉన్న దేశ అధికారులు ఎవరికి వారు కర్ఫ్యూ విధించారు. అయితే ఇండియాలో కూడా ప్రధాని మోడీ 21 రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే నిత్య అవసరాలు మరియు రైతు బజార్ల విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే రైతు బజార్ల వద్ద సామాజిక దూరం పాటించకుండా జనాలు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో... రైతు బజార్లను వికేంద్రీకరించడం ద్వారా రద్దీని చాలా మటుకు నివారించవచ్చని ముఖ్యమంత్రి భావించారు. ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యావసరాల దుకాణాల వద్ద కూడా ప్రజలు దూరం దూరంగా నిలబడేలా మార్కింగ్‌ చేయాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా దుకాణాలను ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెరవాలని అనుమతి ఇచ్చినట్లు వార్తలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: