ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇండియాలో కూడా రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రధాని మోడీ లాక్ డౌన్ 21 రోజుల పాటు ఇంటికే పరిమితం అవ్వాలని పిలుపు ఇవ్వటం జరిగింది. దీంతో దేశంలో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఉన్న కొద్ది పరిమితం కావడంతో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం తప్ప వేరే మార్గం లేదని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అంతేకాకుండా 21 రోజుల పాటు ఇంట్లోనే ఉంటే వైరస్ ను అరికట్టే గ్యారెంటీ ఉందా అంటే అది కష్టమని చెప్పుకొచ్చారు. దేశంలో ఎన్నికల వ్యూహకర్త గా మంచి పేరు కలిగిన ప్రశాంత్ కిషోర్ లాక్ డౌన్ 21 రోజుల కర్ఫ్యూ పై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

 

అయితే ఈ విషయంలో మోడీ ప్రభుత్వం సరైన విధంగా ప్రిపేర్ కాలేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. చైనా నుంచి మనదేశానికి యాక్సెస్ వున్న అన్ని అవకాశాలను ముందే అంఛనా వేసి తగిన విధంగా దేశాన్ని సంసిద్దం చేయడంలో మోదీ విఫలమయ్యారని ప్రశాంత్ కిశోర్ అంటున్నారు. నెల రోజులకు పైగానే లాక్ డౌన్ కొనసాగే పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ వైరస్ విజృంభణ పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఖరాఖండీగా చెప్పుకొచ్చారు. ముందు ముందు ఇంకా చాలా దారుణమైన రోజులు చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. మరోపక్క సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్లకు వెరైటీగా ప్రతిస్పందించారు. అన్ని రోజులు ఇంట్లో ఉంటే ఎలా మరి ? అంటూ ప్రశ్నల వర్షం కొంతమంది కురిపించారు. ఈ వైరస్ నుండి తప్పించుకున్నా గాని తర్వాత దేశంలో ఆకలి కేకలు ఎక్కువైతే సమాజం మొత్తం అస్తవ్యస్తం కావటం గ్యారెంటీ అని మరికొంతమంది తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. దీంతో లాక్ డౌన్ పై ప్రశాంతి కిషోర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: