దేశ వ్యాప్తం గా కరోనా వైరస్ వ్యాప్తి ని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జనతా కర్ఫ్యూ పేరు తో  ప్రజల ను ఇళ్లకే పరిమితం చేసింది. మార్చి 22 నుంచి  ప్రారంభమై న ఈ కర్ఫ్యు లో భాగంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేకాకుండా కరోనా ప్రభావం మరింత పెరుగుతుండటం తో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. 

 

 

ఈ సందర్బం గా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జనాల ను బయటకు తిరగ కూడదని నిర్ణయించింది. అయినా కొందరు బయట తిరుగుతున్నారు. అలాంటి వారికి పోలీసులు కరోనా పై లాక్ డౌన్ పై అవగాహన తెలుపుతున్నారు. అంతే కాకుండా బయట కు రాకూడ దో సూచిస్తున్నారు. పరి శుభ్రం గా ఉంటూ కరోనా వ్యాప్తిని తాగ్గించే ప్రయత్నం చేయాల నీ ప్రభుత్వం నిర్ణయించింది. 

 

 

అమీర్‌పేట, పంజాగుట్ట లోని హాస్టళ్ల లో ఉంటున్న యువతీ యువకు లకు తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి షాకిచ్చారు. హాస్టళ్ల ను ఖాళీ చేయాలంటూ నిర్వాహకు లు ఒత్తిడి తీసుకురావడం తో తాము ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో వారు ఇళ్లకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. అయితే, తాజాగా డీజీపీ ప్రకటన వారిని మరోమారు ఆందోళనలోకి నెట్టేసింది.

 

 


హైదరాబాద్ నుంచి వెళ్లడానికి విద్యార్థులకు ఇచ్చిన పాసులు చెల్లవని తేల్చి చెప్పేసారు. ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలేవీ చెల్లవని డీజీపీ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యార్థులను ఖాళీ చేయించొద్దని, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు వెళ్లి .  హాస్టల్ నిర్వాహకులతో మాట్లాడాలని ఆదేశించారు.ఇప్పటికే వెళ్లిన విద్యార్థులు మధ్యలోనే ఆగి పోయారు. ఇకపోతే హాస్టల్ మూసివేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: