ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ దేశమంతటా మూడు వారాలపాటు లాక్ డౌన్ ప్రకటించగా.. జనాలంతా అప్రమత్తులై తమ ఇళ్ళ నుండి బయటకు రాకుండా కరోనా మహమ్మారిని ఆదిలోనే తుంచేసేందుకు సహకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పరిస్థితి మాత్రం అలా లేదు. రెండు రాష్ట్రాల లోపల ప్రజలంతా సంయమనం పాటిస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు మాత్రం పరిస్థితిని లెక్కచేయకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.

 

IHG

 

విషయం ఏమిటంటే తెలంగాణ లో మరీ ముఖ్యంగా హైదరాబాదులో నివసిస్తున్న వేలాది మంది ఆంధ్రులు లాక్ డౌన్ సందర్భంగా రాబోయే మూడు వారాలు తమ సొంత ఊర్లో నివాసం ఉండేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లు తీసుకొని ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరగా ఆంధ్ర పోలీసులు వారిని సరిహద్దుల్లోనే నిలువరించారు. ఇలా పక్క రాష్ట్రం నుండి వస్తున్న వారిని తాము లోనికి అనుమతించమని వారికి రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి 14 రోజులు క్వారంటైన్ లో అయినా ఉండండి లేదా రెండు.... వెనక్కి తిరిగి ఎక్కడి నుండి వచ్చారో అక్కడికే వెళ్లిపోండి అని చెబుతున్నారు.

 

IHG

 

అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు విజయవాడ దగ్గర దాదాపు 20 కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ జామ్ అయిపోయి వేలాది మంది ఒకచోట గుమిగూడి ఉన్నారు. ఇకపోతే హైదరాబాద్ కర్నూల్ హైవే లోని సరిహద్దు దగ్గర ఐదు కిలోమీటర్ల వరకు ప్రజలంతా వాహనాలతో ఇరుక్కొని ఉండగా వారిలో ఒకరిద్దరు కరోనా పాజిటివ్ వారు ఉన్నా.. అక్కడ ఉన్న కొన్ని వేల మందికి వారి నుండి మరి కొన్ని వందల మందికి వైరస్ సోకుతుంది. అదే కనుక జరిగితే ఎక్కువ జనసాంద్రత ఉండే తెలుగు రాష్ట్రాల్లో వైరస్ ఇష్టం వచ్చినట్లు ప్రబలుతుంది. కాబట్టి పరిస్థితి చేయి దాటక ముందే ఇద్దరు ముఖ్యమంత్రులు విషయమై చర్చించుకుని ఒక పరిష్కారానికి వస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: