ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత అల్లకల్లోలం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే అయితే వ్యాధి ని సమూలంగా నాశనం చేసేందుకు కావలసిన వ్యాక్సిన్ ఇంకా శాస్త్రవేత్త కనిపెట్టకపోవడంతో ప్రపంచంలో మరణాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఇటలీ దేశం లో చాలా భాగం మహమ్మారి వల్ల స్మశానంగా మారగా ఫ్రాన్స్ మరియు అమెరికా దేశాలు దీని వల్ల భారీగా దెబ్బతిన్నాయి. తాజాగా బ్రిటన్ యువరాజు మరియు స్పెయిన్ డిప్యూటీ ప్రధానమంత్రికి కూడా వైరస్ సోకడం చూస్తుంటే ఇది ఎంత ప్రమాదకరమో తెలుస్తోంది.

 

అయితే దీనికి మందు కనిపెట్టే లోపల జరిగే మారణకాండ అంతా ఇంత కాదు కాబట్టి ముందు వైరస్ బారిన పడ్డ వారిని గుర్తించడం మరియు వారిని ప్రజల నుండి వేరు చేయడం ముఖ్యం. ఇందుకు సంబంధించి వైరస్ సోకితే వచ్చే లక్షణాలుగా దగ్గు, జలుబు, విపరీతమైన జ్వరం మరియు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి అని వైద్యులు, శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు మరింత లోతుగా పరిశోధన జరుపుతూ ఉండగా వారికి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.

 

వారి దేశంలో నమోదైన వేలాది కరోనా పాజిటివ్ కేసులలో కొంతమంది జలుబు మరియు దగ్గు రాకుండానే వైరస్ బారిన పడినట్లుగా తెలుసుకున్నారు. వారిని అవి కాకుండా వేరే ఏవైనా లక్షణాలు ఉన్నాయా అని ప్రశ్నించగా కొద్ది రోజుల క్రితమే వారికి వాసన గుర్తుపట్టే స్వభావం కోల్పోవడం మరియు ఏది తిన్నా రుచి తెలియకపోవడం అనుభవించారట. కాబట్టి ఇప్పుడు వారితో పాటు ఇంగ్లాండ్ లోని శాస్త్రవేత్తలు కూడా కరోనా వైరస్ వ్యాధి లక్షణాలుగా రుచి మరియు వాసన గుర్తుపట్టే స్వభావం కోల్పోవదాన్ని కూడా లిస్టులోనికి చేర్చి ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: