కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ మే నెల మధ్యభాగంలో మనదేశంలో 13 లక్షలు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతాయి అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదేంటి ప్రస్తుతం కేవలం 600 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్న మన దేశంలో మరొక నెలన్నర రోజులకి ఒక్కసారిగా 13 లక్షల కేసులు బయటపడడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు కింది మ్యాటర్ చదవాల్సిందే.

 

IHG

 

విషయమేమిటంటే కొంతమంది పరిశోధకులు కోవిడ్-19 స్టడీ గ్రూప్, ఇంటర్ డిసిప్లినరీ గ్రూప్ ఆఫ్ స్కాలర్స్ మరియు డేటా సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం భారతదేశంలో కరోనా పాజిటివ్ కు సంబంధించిన టెస్టుల ప్రక్రియ యొక్క తరచుదనం గమనించినట్లయితే మార్చి 18 తారీఖు వరకు కేవలం 11,500 మందికే కరోనాకి సంబంధించిన టెస్ట్ లు జరిపారు. దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కరోనా వైరస్ రెండవ దశకు చేరుకున్న సమయంలో ఇంత తక్కువ మందికి టెస్టులు జరపడం అన్నది చాలా ఆందోళనకరమైన విషయం.

 

IHG

 

సరిగ్గా ఇప్పుడు భారత్ ఉన్న సమయంలోనే అమెరికా కూడా ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇటలీ కూడా దాదాపు  మార్చి 18 కి 11 రోజుల క్రితం అనగా మార్చి 7 తేదీన సరిగ్గా వారి దేశంలో అంతే మందికి కరోనా టెస్టులు జరిపారు. అంటే అతి తక్కువ మందికి కరోనా పాజిటివా లేక నెగిటివా అని నిర్ధారించే టెస్ట్ జరపడం వల్ల చాలామంది టెస్టుని తప్పించుకొని కొన్ని వేల మందికి వైరస్ ను అంటించే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం మరియు అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఎక్కువ మెడికల్ కిట్లు తెప్పించి సాధ్యమైనంత ఎక్కువ మంది అనుమానితులకు టెస్టులు జరిపించటం మంచిది.

 

IHG

 

అదీ కాకుండా భారత దేశంలో ప్రతి 1000 మందికి 0.7 బెడ్లు ఉండగా ఫ్రాన్స్లో సంఖ్య 6.5 గా ఉంది. ఇకపోతే ప్రతి 1000 మందికి గాను చైనాలో 4.2, ఇటలీలో 3.4, ఇంగ్లాండ్ లో 2.9, అమెరికాలో 2.8 మరియు ఇరాన్ లో 1.5 బెడ్లు ఉన్నాయి. అక్కడే అంత మారణకాండ జరిగితే ఇక మన దేశంలో రకంగా జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: