తమిళనాట సినిమా అంటే జనానికి పిచ్చి.. అక్కడ అభిమానుల అభిమానం రేంజ్ ఓ స్థాయిలో ఉంటుంది. అలాగే అక్కడ నటులకు కూడా సమాజ స్పృహ కాస్త ఎక్కువే. ఏదైనా కష్టం వస్తే మేమున్నామంటూ ముందుకొస్తారు. ఇప్పుడు కరోనా వైరస్ విషయంలోనూ అలాగే జరుగుతోంది. కరోనా వైరస్ కారణంగా సినిమా రంగం పూర్తిగా స్తంభించిన పోయిన సంగతి తెలిసిందే.

 

 

సినిమా షూటింగులు పూర్తిగా నిలిచిపోవడంతో.. సినీ కళాకారుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే పేద సినీ కళాకారులను ఆదుకునేందుకు తమిళ సినీ ప్రముఖులు

ముందుకొచ్చారు. రజనీకాంత్, ధనుష్, కమల్, కార్తీ, విజయ్ సేతుపతి వంటి నటులు విరాళాలు ప్రకటించారు. సినీ పరిశ్రమలోని పేద కళాకారులను ఆదుకునేందుకు కమల్ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు.

 

 

రజినీకాంత్ రజనీకాంత్ రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. ఆయన అల్లుడు ధనుష్ కూడా రూ. 15 లక్షలు విరాళం ఇచ్చారు. ఇక దర్శకుడు శంకర్ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. సూర్య, కార్తి, శివకుమార్ కలిసి ఇప్పటికే రూ. 10 లక్షలు ప్రకటించారు. విజయ్ సేతుపతి రూ. 10 లక్షలు, శివకార్తికేయన్ రూ. 10 లక్షలు ప్రకటించారు.

 

 

మరికొందరు వస్తు రూపేణా సాయం చేస్తున్నారు. తమిళ దర్శకుడు హరి 100 బస్తాల బియ్యం, నిర్మాత ఢిల్లీ బాబు 20 బస్తాల బియ్యం పేద కళాకారులకు అందిస్తామని ప్రకటించారు. ఇక కమల్ హాసన్ మరో అడుగు ముందుకేసి కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు తన ఇంటిని ఆసుపత్రిగా మారుస్తానని ప్రకటించాడు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే తన ఇంటిని ఆసుపత్రిగా మార్చేస్తానని కమల్ హాసన్ చెప్పారు. మరి ఆ స్థాయిలో టాలీవుడ్ మాత్రం స్పందించడం లేదు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: