కరోనా దెబ్బకు ఇప్పుడు అన్ని వ్యాపారాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో వ్యాపారాలు అన్నీ కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు వచ్చే ఆదాయం కూడా భారీగా పడిపోయే అవకాశ౦ ఉందీ అనేది వాస్తవం. ప్రజలకు ఆదాయం పడిపోతే మాత్రం ఇప్పుడు చేసేది ఏమీ ఉండదు. ఏ విధంగా చూసినా ఉపాధి దొరకడం అనేది ఇప్పట్లో చాలా కష్టం. ఇక్కడ ప్రభుత్వాలు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా సరే ప్రజలు ఇబ్బంది పడటం అనేది ఖాయం. ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశం ఎంత మాత్రం ఇప్పట్లో ఉండదు అనే అంటున్నారు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆదాయం పడిపోతుంది కాబట్టి, ఉపాధి కూడా ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు కాబట్టి ప్రజలు అందరూ కూడా డబ్బులు అవసరం అనుకుంటేనే తీయాలి అని సూచిస్తున్నారు. కష్టం అవ్వడం ఖాయమని ప్రజలు ఇబ్బంది పడే రోజు దగ్గరలోనే ఉందని, ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రూపాయి తీసి ఖర్చు చెయ్యాలి అన్నా సరే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. విలాసాలకు అవకాశం లేదు. అన్నీ కూడా దాదాపుగా మూసి వేస్తారు. అయినా సరే ఆన్లైన్ అదీ ఇదీ అని డబ్బులు వృధా చేసుకోకుండా ఉండటమే మంచిది. 

 

పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా ఎవరూ అంచనా వేయలేని విధంగా ఉంది ఇప్పుడు. కాబట్టి ప్రతీ రూపాయి కూడా ఆలోచించి ఖర్చు చేసుకుంటే భవిష్యత్తుకి భరోసా అనేది ఉంటుంది. ధరలు పెరిగిపోతాయి కాబట్టి మీ వద్ద డబ్బు కొరత ఎక్కువగా ఉంటుంది. మధ్య తరగతి ప్రజలు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విలాసాలకు గాను పిల్లలకు డబ్బులు ఇవ్వడం ఎంత మాత్రం మంచిది కాదు అనే అభిప్రాయమే ఎక్కువగా వినపడుతుంది ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: