కరోనా కారణంగా లాక్ డౌన్ ని దేశ వ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించడం లేదు. కరోనా వైరస్ ని ఎక్కడ ఆహ్వానించాలో అని భయపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం కఠిన నిర్ణయాలు అమలు చేయడం మినహా ప్రభుత్వానికి ఉండే మార్గం ఏమీ లేదు. దేశ వ్యాప్తంగా ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకుండానే ఉంటే మంచిది అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. చాలా మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వాలు ఈ విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. 

 

అయితే ఇక్కడ కొందరు పోలీసులు అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు ఆందోళన కరంగా మారింది. బయటకు వస్తున్న వారి మీద అనవసరంగా దాడులకు దిగుతున్నారు పోలీసులు. ఒక దెబ్బ రెండు దెబ్బలు వేస్తే పర్వాలేదు గాని గొడ్డుని కొట్టినట్టు కొడుతూ భయపెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం ఉంటే మినహా ఎవరూ బయటకు రారు. కనీసం వారి కారణం ఏంటీ అనేది కూడా వినకుండా కొట్టడం అనేది ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో దొరికిందే అవకాశం అనుకున్నారో ఏమో గాని ఇష్టం వచ్చినట్టు దాడులకు దిగుతున్నారు. 

 

రోడ్డు మీద మనుషులను కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు. బహుశా వాళ్లకు కొట్టాలి అనే కోరిక ఉందేమో గాని ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు మాత్రం ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. తమకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వాడుకోవద్దు అని భావించారో ఏమో తెలియదు గాని ఇష్టం వచ్చినట్టు దాడులకు దిగుతున్నారు. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజలు అవసరం ఉన్నా సరే బయటకు రాకుండా ఆకలి కేకలతో చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు అతి చేయకుండా ఉండటం మంచిది అని పలువురు పోలీసులకు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: