తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 40 వరకూ చేరింది. అయితే తెలంగాణలో కరోనా విజృంభించేందుకు ఇండోనేసియా నుంచి 17 రోజుల కిందట కరీంనగర్‌కు వచ్చిన పది మంది కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ వరకూ విమానంలో వచ్చి అక్కడి నుంచి రైల్లో తెలంగాణకు వచ్చిన ఈ ఇండోనేషియా వాసులు అక్కడ విచ్చల విడిగా తిరిగారు. పదుల సంఖ్యలో వీరి వల్లో కరోనాకు గురయ్యారని తెలుస్తోంది. వీరు కలిసినందుకు తెలంగాణలోని దాదాపు 500 మందిలో కొందరిని హోం క్వారంటైన్‌ చేయగా, మరికొందరిని ఆస్పత్రులకు పంపించారు.

 

 

అయితే ఇంకో దారుణమైన విషయం ఏంటంటే.. వీరికి ఇండోనేషియాలో కరోనా ఉందని తెలుసట. ఈనెల 9న ఇండోనేసియా నుంచి పదిమంది ఢిల్లీకి దిగిన సమయంలోనే వీరికి ఫుల్లుగా జ్వరం ఉందట. అప్పటికే విమానాశ్రయాల్లో తనిఖీలు జరుగుతున్నందు వల్ల పట్టుబడకుండా వీరి అతి తెలివితేటలు చూపించారు. విమానం దిగక ముందు.. దిగిన తర్వాత పారాసిటమాల్‌ మాత్రలు వేసుకున్నారట. దీంతో విమానాశ్రయంలో దొరకకుండా తప్పించుకుని జనం మీదకు వచ్చి పడ్డారు.

 

ఢిల్లీలో దిగిన వీరంతా అక్కడ ఒక రోజుపాటు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో తిరిగారు. ఆ తర్వాత సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ లో ప్రయాణించి రామగుండం చేరుకున్నారు. అక్కడ నుంచి ఓ వాహనంలో కరీంనగర్‌కు వెళ్లారు. ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల్లో పలు మత కార్యక్రమాలు నిర్వహించారు. అయితే అక్కడ వారిలో ఒకరికి అప్పటికే కరోనా ప్రభావం బాగా కనిపించింది. అనుమానంతో పరీక్షలు చేయించుకుంటే కరోనా సంగతి బయటపడింది.

 

 

మిగతావారికి కూడా పరీక్షలు చేస్తే అందరికీ కరోనా ఉన్నట్టు తేలింది. ఇప్పుడు వారితో పాటు రైళ్లో ప్రయాణించిన వారి డేటా అంతా సేకరించి.. వారికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారందరినీ క్వారంటైన్ చేస్తున్నారు. ఇండోనేసియావాసుల అతి తెలివితో తెలంగాణ కరోనా బారినపడే పరిస్థితి వచ్చింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: