ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కూడా కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి గాను కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నాయి. ప్రజలను ఎలాంటి పరిస్థితుల్లో కూడా బయటకు రాకుండా చూడాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉండాలని అంటున్నారు. బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ ని కట్టడం చేయడం అనేది పెద్ద విషయం కాదు అనేది చాలా మంది మాట. కాని ప్రజలు మాత్రం దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు. 

 

ఈ విషయం చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. ముఖ్యంగా యువత మాత్రం ప్రభుత్వాల మాట అనేది అసలు వినడం లేదు. రోడ్ల మీదకు అనవసరంగా వెళ్లి వేధిస్తున్నారు. పోలీసులు కొడుతున్నా సరే వీడియో లు తీయడానికి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడానికి బయటకు వస్తున్నారు యువత. దీనిపై ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా సరే ఎవరూ కూడా వినే పరిస్థితి ఇప్పుడు ఉండటం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. జైల్లో పెడుతున్నా కాల్చి పారేస్తామని చెప్తున్నా కూడా ఎవడూ వినడం లేదు. పని లేని పనికి రోడ్డు మీదకు వస్తూ చికాకు పెడుతున్నారు. 

 

యువతను కట్టడి చేయడం అనేది ఇప్పుడు చాలా ఇబ్బందిగా మారింది. అనవసరంగా రోడ్ల మీదకు వస్తూ ఎందుకు వస్తున్నారో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ అనేది మూడో దశకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. మూడో దశకు వెళ్ళింది అంటే దాన్ని అదుపు చేయడం అనేది ఎవరి తరం కాదు అనే విషయాన్ని అందరూ గుర్తిస్తే మంచిది. యువత అనే వాళ్ళు అందరికి దాని ప్రభావం చెప్పాలి. అంతే గాని చిల్లరగా రోడ్డు మీద తిరగవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: