కరోనా వైరస్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన ఏంటీ...? కరోనా వైరస్ బాధితులు పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి...? శాంపిల్ తీయడం లేదని కేవలం వేల మందికి మాత్రమే శాంపిల్స్ తీస్తున్నారని కాని అది వేల మందికి కాదు లక్షల మందికి సోకే అవకాశం ఉందని అంటున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర చాలా ఇబ్బంది పడుతుంది. సెంచరి దాటాయి కరోనా కేసులు అనే విషయం అర్ధమవుతుంది. 

 

మరణాలు కూడా అక్కడ పెరుగుతున్నాయి. ఇప్పుడు మన దేశంలో 700 లకు దగ్గరగా ఉన్నాయి కరోనా బాధితుల కేసులు. మరికొంత మందికి పరిక్షలు చేస్తే అది బయటపడే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందే నిద్ర లేచి ఉంటే మాత్రం పరిస్థితి చాలా వరకు అదుపులో ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మన దేశంలో కరోనా విస్తరణ ఇప్పుడు అదుపులో ఉందని, అయితే మరికొంత మందికి వేగంగా పరిక్షలు చేస్తే మాత్రం అది బయటపడకుండా అడ్డుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. 

 

 ఇప్పుడు గనుక ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా సరే పరిస్థితి చేయి దాటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మన దేశంలో కరోనా వైరస్ అనేది ఒక్కసారి విస్తరించడం మొదలు పెడితే దాన్ని అదుపు చేయడం అనేది చాలా కష్టం అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రజల్లో ఎలాగూ అవగాహన అనేది లేదు కాబట్టి ప్రభుత్వాలే ఈ విషయంలో జాగ్రత్తలు పడితే మంచిది అంటున్నారు. మరిన్ని పరిక్షలు చేస్తే కరోనా వైరస్ ని కట్టడి చేయడం కాస్త సులువు అవుతుంది అంటున్నారు. మరి ఎంత మందికి పరిక్షలు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: