సోషల్ మీడియా అనేది జనాలకు అందుబాటులోకి రావడం వలన ఉపయోగాలు ఏమి ఉన్నాయో నష్టాలు మాత్రం చాలానే ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఒక పక్క కరోనా వైరస్ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతుంటే ప్రజలను మరింతగా భయపెడుతున్నారు సోషల్ మీడియాలో కొందరు. ప్రజలకు ఇప్పుడు ఏ చిన్న వార్త వచ్చినా సరే అది భయపెట్టే విధంగానే ఉంటుంది. అయినా సరే సోషల్ మీడియాలో మాత్ర౦ ఎవరూ కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఎవరూ వినడం లేదు. ఎన్ని హెచ్చరికలు చేసినా సరే సోషల్ మీడియాలో మాత్రం ఆగడం లేదు. 

 

ఇప్పుడు దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ కి మందు కనుక్కున్నారని అది రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రావడం ఖాయమని అమెరికా దీన్ని తయారు చేసింది అంటూ యేవో ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎవడి సందడి వాడు హేస్తున్నాడు. ఇక కరోనా వచ్చేసింది అని తుమ్మిన ప్రతీ ఒక్కడికి కరోనా వైరస్ ఉండే అవకాశం ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాగే కోడి గుడ్డు లో కరోనా వైరస్ ఉందని డబ్బుల ద్వారా కూడా కరోనా వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం ఇప్పుడు మరింత ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 

 

ప్రస్తుతం కరోనా వ్యాప్తి అనేది క్రమంగా పెరుగుతుంది. దానికి మందు అనేది ఎక్కడా కనుక్కోలేదు. దాని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి గాని ఎవరూ కూడా కనుక్కున్నట్టు లేదు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతీ తప్పుడు ప్రచారం కూడా నమ్ముకుని డబ్బులు వృధా చేసుకోవద్దు. అలాగే సోషల్ మీడియాలో కరోనా వైరస్ లక్షణాలు చెప్పినా సరే వాటిని ఏ విధంగా కదా నమ్మే ప్రయత్నం చేయవద్దు. వైద్యులు చెప్పినవి ప్రభుత్వాలు చెప్పినవి మాత్రమే నమ్మండి.

మరింత సమాచారం తెలుసుకోండి: