ఇప్పుడు ప్రపంచం పూర్తిగా మారిపోయింది.. ఇన్నాళ్లుగా ఓ మనుషుల్లారా మారండిరా అంటే వినని మనుషులు కరోనా దెబ్బకు కాకుల్లా ఉన్న వారు కోకిలలా మారారు.. మాటి మాటికి చేతులు కడుక్కోవడం, కరోనా కట్టడి గురించి మాటలు చెప్పడం, వీలైతే సహాయం చేయడం లాంటివి చేస్తున్నారు.. ఇదే కాకుండా అతి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు.. ఇదంత కూడా బాగానే ఉంది కాని కొందరు మాత్రం కరోనా విషయంలో ఇంట్లో వారిని ఇబ్బందులు పెడుతున్నారు.. ఒక ఇబ్బంది అని చెప్పడానికి వీలు లేదు.. మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. అందుకు ఉదాహరణగా ఓ భర్తను చెప్పవచ్చూ..

 

 

జాగ్రత్తగా ఉండమని అధికారులు చెబితే పెళ్లాన్ని, పిల్లలను తరిమేసి ఉండమని కాదు.. ఇకపోతే కొందరు జనాలు కరోనా పేరుతో ఏదేదో ఊహించుకుంటూ ఓ భార్యభర్తల మధ్య చిచ్చుపెట్టారు.. కరోనాను కాపురాలు విడదీయడానికి వాడుతున్నారు.. ఇలాగే జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుంటే.. చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సుకుమామిడికి చెందిన కుండ్ల రాజారెడ్డి, లక్ష్మి దంపతులకు మూడో తరగతి చదువుతున్న కొడుకు సంజీవరెడ్డి ఉన్నాడు. కాగా సంజీవరెడ్డి నాలుగు రోజులుగా టైఫాయిడ్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు.

 

 

అయితే ఈ విషయంలో చుట్టుపక్కల ఉన్న వారు రాజారెడ్డి మైండ్‌ను దొబ్బేసి అతనికి భయం కలిగించారు.. వారి మాటలు పట్టించుకున్న ఇతను కొడుకుకు కరోనా వైరస్ సోకిందని భావించి, భార్యను కొట్టి.. కొడుకుతో పుట్టింటికి వెళ్లిపోవాలని బెదిరించడమే కాకుండా, ఇద్దర్ని ఇంట్లో నుంచి బయటకు తరిమేశాడు. ఇలాంటి పరిస్దితుల్లో ఏం చేయాలో తెలియని ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది.

 

 

వెంటనే రంగంలోకి ఎస్సై స్థానిక సచివాలయ సిబ్బందితో మాట్లాడి, వారిద్దరిని దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపి పరీక్షలు నిర్వహింప చేసాడు.. ఇక అక్కడి వైద్యులు బాలుడికి కరోనా లక్షణాలు లేవని, కేవలం జ్వరంతో బాధపడుతున్నాడని తెలిపారు.. తర్వాత ఆరోగ్య కార్యకర్త ఇద్దరిని వారి ఇంటికి తీసుకెళ్లి భర్తకు కౌన్సెలింగ్‌ ఇచ్చింది.. చూసారా ఇలా బుర్రతక్కువ మనుషులు కూడా ఉన్నారు లోకంలో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: