రాజ‌కీయాలు చేసే స‌మ‌యం కాదిది! ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. కీల‌క‌మైన ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆరోగ్య ప‌రంగా అవ గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు ఏదైనా మంచి ప‌ని ఉంటే సాయం చేయ‌గ‌ల‌గాలి. ఇప్ప‌టికే అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే ప‌ని చేస్తున్నారు. శానిటైజ‌ర్ల‌ను పంచ‌డం, ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు నిధులు ఇవ్వ‌డం, మందులు కొనుగోలు చేసి ఇవ్వ‌డం ఇలా త మకు తోచిన విధంగా ప్ర‌జ‌ల‌కు ఏదో ఒక రూపంలో సాయం చేస్తున్నారు. దీనిలో రాజ‌కీయాలు లేవు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు కూడా సీఎం రిలీఫ్ ఫండ్‌కు త‌న కుటుంబం త‌ర‌ఫున 10 ల‌క్ష‌లు ఇచ్చారు.

 

ఇక‌, త‌న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కు చెందిన ఒక నెల వేత‌నాన్ని కూడా సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇ లా త‌న‌దైన శైలిలో బాబు ముందుకు వ‌చ్చారు. కానీ, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన టీడీపీ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రించి న తీరు మాత్రం వివాదాస్ప‌దంగా మారింది. పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు, ఉండి ఎమ్మెల్యే రామ‌రాజులు ఇద్ద రూ కూడా ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఏదైనా మేలు చేయాల‌ని భావించారు. ఇది మంచి ప‌రిణామ‌మే. అయితే, వారు అనుస‌రించిన తీరుపై మాత్రం నెటిజ‌న్ల నుంచి భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి.

 

పాల‌కొల్లు ఎమ్మెల్యే రామానాయుడు .. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వినూత్న రీతుల్లో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. శ్మ‌శానాల‌ను శుభ్రం చేయ‌డం, ఇంటింటికీ తాగునీరు అందించ‌డం వంటివి చేప‌ట్టి మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించేందుకు ప్ర‌య‌త్నించారు. ఇది కూడా మంచిదే. అయితే, ఇప్పుడు మాత్రం ఇలాంటి నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డం స‌మంజ‌స‌మా?  కానీ, ఆయ‌న పారిశుద్ధ్య కార్మికుడి మాదిరిగా క్రిమి సంహార‌క ద్రావ‌ణ ట్యాంకును భుజాల‌కు త‌గిలించుకుని కాల్వ‌ల్లో చ‌ల్లుతూ.. మునిసిపాలిటి ప‌నివాడిగా మారారు. ఇక‌, రామ‌రాజు కూడా ఇదే త‌ర‌హా లో ట్యాంకును భుజాల‌కు త‌గిలించుకుని ఫొటోలకు పోజులు ఇచ్చారు.

 

దీనిపైనే ఇప్పుడు నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. ఇలాంటి క‌రోనా క‌ట్ట‌డి స‌మ‌యంలో కూడా ఇలా వ్య‌వ‌హ‌రిస్తారా? అంటూ.. నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు, ఈ నిర‌స‌న కేవ‌లం ఫొటోల కోస‌మేన‌ని, లేదంటే.. మొత్తం వీధి వీధంతా కూడా ఇలా మునిసిపాలిటీ ప‌నిచేయ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు. ఇలాంటి స‌మ‌యంలో ఇలాంటి జిమ్మిక్కులు మంచిది కాద‌ని సూచిస్తున్నారు. నిబద్ధ‌త ఉంటే.. ఇంటింటికి తిరిగి ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకోవాల‌ని, వారికి ధైర్యం చెప్పే ప‌నులు చేయాల‌ని సూచిస్తున్నారు. మొత్తానికి ఇద్ద‌రు ఎమ్మెల్యేల ప్ర‌యోగం విక‌టించింద‌నే వ్యాఖ్య‌లు మాత్రం వినిపిస్తున్నాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

ఎన్ ఐ హెచ్ డ‌బ్ల్యు ఎన్  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: