కేంద్ర అధికార పార్టీ బిజెపి పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, ఏపీలో మాత్రం ఆందోళనకరంగానే కనిపిస్తోంది. ఎప్పటి నుంచో ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ కి కాలం కలిసి రావడం లేదు. పార్టీకి చెప్పుకోదగిన బలమైన నాయకులు ఎవరూ కనిపించడం లేదు. కేవలం బిజెపి అగ్ర నేతల నుంచి వచ్చిన ఆదేశాలను తు చ తప్పకుండా పాటించే వారే తప్ప సొంతంగా పార్టీ ఎదుగుదలకు క్షేత్రస్థాయిలో బలోపేతం చేయగలిగిన నాయకులు ఎవరు కనిపించడం లేదు. పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా... ఇక్కడి నాయకులు మాత్రం ఉసూరుమంటూ రాజకీయాలు నెట్టుకొస్తున్నారు. అసలు కేంద్ర అధికార పార్టీ అన్న హోదా కూడా ఇక్కడి నాయకులు ప్రదర్శించ లేకపోతున్నారు.

IHG

 

 ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకుని ఒకటి రెండు సీట్లు సంపాదించడం తప్ప సొంతంగా పోటీ చేసి గెలవగలిగే స్థాయిలో బిజెపి వ్యవహరించ లేకపోతోంది. ఇక కేంద్ర బిజెపి పెద్దలు కూడా ఏపీలో పార్టీ పుంజుకోవడం కష్టమే అన్న అభిప్రాయానికి వారంతా వచ్చేసినట్టు గా కనిపిస్తోంది. ఇలా నిస్తేజంలో బీజేపీ నాయకులు ఉండగానే వారికి జనసేన పార్టీ ఆశాకిరణంగా కనిపించింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీలో చరిష్మా ఉన్నా రాజకీయంగా ినుకో రాజకీయాల్లో వెనుకబడి పోయారు. అంతేకాకుండా గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఆ పార్టీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.


 ఇక అప్పటి నుంచి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న బిజెపి దగ్గరికి తీసుకుని ఆ పార్టీతో కలిసి పొత్తుపట్టుకుని బిజెపి జనసేన కూటమి బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో పట్టు సాధించాలని ప్రయత్నించింది. అయితే ఆ ఆశ మాత్రం తీరినట్టు గా కనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఈ వ్యవహారం మరోసారి బయటపడింది. రాష్ట్రంలో వివిధ చోట్ల జనసేన బీజేపీ కూటమి తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. 


అసలు టిడిపి వైసిపి కి ధీటుగా అభ్యర్థులను నిలబెట్టగలిగే ధైర్యం కూడా ఈ రెండు పార్టీలు చేయలేకపోవడంతో బీజేపీ పరిస్థితి ఏంటి అనే విషయం అందరికీ అర్థమైపోయింది. పవన్ తో పొత్తు పెట్టుకుని ఆయన ప్రభావం కూడా అంతంతమాత్రంగానే ఉందని బిజెపి అగ్రనేతలు అభిప్రాయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: