కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తూనే అన్ని దేశాలపై పంజా విసురుతుంది. ఈ వైరస్ చైనాలో పుట్టిన కొద్దీ రోజుల్లోనే దేశాలకు పాకింది. ఈ వైరస్ కు విరుగుడు, మందు లేకపోవడంతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అవి కొంత మేరకు మాత్రమే సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇకపోతే భారత్ లో కూడా ఈ వైరస్ వేగంగానే విస్తరిస్తుంది. ఈ వైరస్ మన దేశంలో కూడా పంజా విసిరింది. ఎన్ని జాగ్రత్తలు పాటించిన ఈ మహ్మమారి మాత్రం మన దేశాన్ని వదిలిపోవటం లేదు. ఇప్పటికే మనదేశంలో 21రోజులు లాక్ డౌన్ ను విధించారు. అయినప్పటికీ దేశంలో కరోనా బాధితుల సంఖ్యా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే భారత్ లో 657 కేసులు నమోదైయ్యాయి. ఇంకా 12 మంది మృత్యువాత పడ్డారు. 

 

ప్రస్తుతం దేశంలో ఉన్న జనసాంద్రతను చూసి రానున్న రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య 5 లక్షలకు చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేసిన ఘోర ప్రమాదం జరుగుతుందని వారు వెల్లడించారు. దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటుంది. లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఏ పని లేకుండా ఇంట్లో నుండి బయటికి వచ్చిన వారిని పోలీసులు చితకబాదుతున్నారు. 

 

అయితే భారత్ లో 21రోజులు లాక్ డౌన్ సరిపోదని ఇంకా కొన్ని రోజులు పెరిగించే అవకాశాలు ఉన్నాయని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. ఈ వైరస్‌ మరింత వ్యాపిస్తే అందరికీ చికిత్స చేసే మౌలిక వైద్య సదుపాయాలు మన దేశంలో అందుబాటులో లేవన్నారు. ఇప్పటికే మన దేశంలో వెద్యుల సంఖ్య కూడా తక్కువగా ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడానికి సరిపడా డాక్టర్స్ లేరని ఆయన తెలిపారు. అందుకే మన దేశం సరైన సమయంలోనే రంగంలోకి దిగిందని చెప్పారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: