ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మూడు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కరోనా కట్టడి కాకపోతే ఏప్రిల్ 15 తర్వాత లాక్ డౌన్ ను మరింతగా పొడిగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఉన్నతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ లాక్ డౌన్ డేట్ ను పొడిగించే అవకాశం ఉందని చెప్పారు. 
 
ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేయడంలో ఎంతవరకు సఫలమవుతాయో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ప్రధాని లాక్ డౌన్ ను ప్రకటించడానికి మూడు కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. దేశంలో లక్షల మందికి వైరస్ ప్రబలితే చికిత్స చేసే సదుపాయం లేకపోవడంతో లాక్ డౌన్ ప్రకటించారని అన్నారు. జనాభాపరంగా పెద్దదైన భారత్ లో ముందుజాగ్రత్తచర్యలు తీసుకోకపోతే కరోనాను నియంత్రించడం అసాధ్యం అని అన్నారు. 
 
దేశంలో వైద్యుల సంఖ్య తక్కువగా ఉండటం లాక్ డౌన్ ప్రకటించటానికి మరో కారణమని పేర్కొన్నారు. దేశం సరైన సమయంలోనే లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల ముందే లాక్ డౌన్ ప్రకటిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యేదని... ప్రజలు వైరస్ తీవ్రతను గ్రహించిన తరువాతే మోదీ లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించారని అన్నారు. 
 
మరోవైపు నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని... కేంద్రం మరిన్ని రోజులు లాక్ డౌన్ విధిస్తేనే శ్రమకు తగ్గ ఫలితం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా, ఇటలీలో వేల సంఖ్యలో కరోనా భారీన పడి మృతి చెందుతుండటంతో ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

applehttps://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: