నలుగురికి నచ్చనిది నాకసలే నచ్చదురో.. నరులెవరు తిరగనిది ఆ రూట్లో నే నడిచెదరో అన్నట్లు జనాలు ఛస్తున్నార్రో బాబో అన్న నా పద్దతిలో నేను అనన్నట్టుగా జనాలు కొంత మంది తయారయ్యారు.  లాక్ డౌన్ చేసి కరోనాను అరికట్టడానికి ఇంట్లో ఉండాలంటే.. చాలా మంది రోడ్లపై చక్కర్లు కొడుతూ వెకిలి చేష్టలు చేస్తూ ఉన్నారు.  భారత్ లో భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ దారుణంగా వ్యాపిస్తున్న తరుణంలో ఎలాగైనా సరే ఈ మహమ్మారి అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన చర్యలను చేపట్టాయి… అందులో భాగంగానే మొత్తం దేశంలో 21 రోజులు లాక్ డౌన్ విధించడానికి ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. 

 

ఈ లాక్ డౌన్ లో భాగంగా రాష్ట్రంలో విధిస్తున్న కర్ఫ్యూ ని కొందరు ప్రజలు తప్పు దోవ పట్టిస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడుతున్నారు. పోలీసులు, డాక్టర్లు ఎంతో కష్టపడి కరోనాని అరికట్టే ప్రయత్నాలు చేస్తుంటే.. కొంత మంది ఆకతాయిలు దాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ లాక్ డౌన్ చర్యలను మరింతగా కట్టుదిట్టం చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలందరి సహకారంతో అధికారులందరూ కూడా ముందుకు సాగాలని, అంతేకాకుండా రాష్ట్రంలో పోలీసులు నిర్వహిస్తున్న చెక్ పోస్టులను మరింత పటిష్టంగా చేయాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను రోడ్లపైకి రాకుండా చేయాలని ఇది ఒక్కొక్కరికీ చెప్పాల్సిన అవసరం లేదని.. ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. 

 

దేశంలో ఇప్పటికే కరోనా మరణాలు పెరిగిపోతున్నాయని.. ఇలాంటి సందర్భంటా సమిష్టిగా కలిసి ఈ కరోనా వైరస్ ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. గుంపులుగా ఉండకుండా సామాజిక దూరాన్ని పాటించాలని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంగిస్తే తప్పకుండ వారికి జైలు జీవితం తప్పదని, అందుకని దీనికి అందరు కూడా సహాయ సహకారాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: