ఎవరైనా మామూలు జలుబు, దగ్గుతో ఇబ్బందులు పడుతున్నా మిగిలిన వాళ్ళు ఆమడదూరం పారిపోతున్న రోజులివి. ఇక ప్రపంచ వ్యాప్తంగా  కొరోనా వైరస్ సృష్టిస్తున్న విలయం గురించి ఎంత తక్కువ చెప్పుకున్న ఎక్కువే. ఇటువంటి పరిస్దితుల్లో కూడా కొరోనా వైరస్ సోకిన 14 మంది రోగులను అందులోను ఇటలీ వాళ్ళని మన డాక్టర్ ఒంటిరిగా పోరాటం చేసి ప్రాణాలను రక్షించిందంటే మామూలు విషయం కాదు.

 

ఇంతకీ జరిగిందేమిటంటే రాజస్ధాన్ లోని పర్యాటక ప్రాంతాలను చూద్దామని చాలా దేశాల నుండి పర్యాటకులు వచ్చారు. వారిలో ఇటలీ నుండి వచ్చిన 14 మంది కూడా ఉన్నారు. అయితే హఠాత్తుగా కొరోనా వైరస్ సమస్య ముదిరిపోవటంతో విదేశీయులందరికి ముందు జాగ్రత్తగా ప్రభుత్వాలు పరీక్షలు చేయించింది. ఈ పరీక్షల్లో ఇటలీ నుండి వచ్చిన వారందరికీ వైరస్ ఉందని తేలింది. వెంటనే అప్రమత్తమైన వైద్యాధికారులు వాళ్ళందరినీ వేదాంత ఆసుపత్రిలోని  క్వారంటైన్ సెంటర్ కు  తరలించారు.

 

క్వారంటైన్ కు తరలించారు బాగానే ఉంది వీళ్ళకు ఎవరు వైద్యం చేయాలి ? డాక్టర్లందరూ వెనకాడుతుంటే సుశీలా కఠారియా అనే మహిళా డాక్టర్ ముందుకొచ్చింది. అందరికీ తాను వైద్యం చేస్తానని చెప్పటంతో మిగిలిన వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. అప్పటి నుండి సుశీలది దాదాపు ఒంటరి పోరాటమే. నర్సులు, హెడ్ నర్సుల సాయంతో సుశీల ఒక్కత్తే  ఓపిగ్గా అందరికీ వైద్యం చేసింది. పేరుకే డ్యూటి అవర్స్ కానీ 14 మంది రోగులను 24 గంటలూ కంటికి రెప్పలాగ కాపాడాలంటే మామూలు విషయం కాదు. పైగా రోగుల్లో 10 మంది 64 ఏళ్ళ వయస్సు పైబడిన వారే.

 

అందుకే సుశీల చివరకు తన ఇంటిని, కుటుంబసభ్యులను కూడా దాదాపు వదిలిపెట్టేసి రోగుల సేవకే అంకితమైపోయింది.  ఒకవైపు రోగులకు సేవలందిస్తునే మరోవైపు ఇటలీలోని వాళ్ళ కుటుంబసభ్యులతో రోజు మాట్లాడేది. రోగుల పరిస్ధితిని ప్రతిరోజు వాట్సప్ ద్వారా స్టేటస్ పెడుతుండేది. క్వారంటైన్ లో ఉన్నన్ని రోజులు ఇటలీలోని కుటుంబసభ్యులు డాక్టర్ తోనే మాట్లాడేవారు. ఒక్కో పేషంట్ దగ్గర కాసేపు కూర్చుని భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తు వారిని చికిత్సకు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేట్లు కౌన్సిలింగ్ కూడా చేసేది.

 

మొత్తానికి డాక్టర్ సేవల ఫలితంగా 14 మందిలో 10 మంది పూర్తిగా కోలుకుని మొన్న 23వ తేదీన డిస్చార్జ్ అయ్యారు. మిగిలిన వాళ్ళు కూడా మరో రెండురోజుల్లో డిస్చార్జ్ అవ్వబోతున్నారు. అంటే కొరోనా మహమ్మారిపై డాక్టర్ అమ్మే విజయం సాధించినట్లు చెప్పుకోవాలి.

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: