మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైన తర్వాత చంద్రబాబునాయుడుకు ఏమో అయినట్లే ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంలో కూర్చుని పనికిమాలిన డిమాండ్లన్నీ చేస్తున్నాడు. నోటికేదొస్తే అది మాట్లాడేస్తున్నాడు. ఒక్కోసారి చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నాడంటే ఇప్పటికీ తానే అధికారంలో ఉన్నానని అనుకుంటున్నాడా ? అనే అనుమానం వచ్చేస్తోంది వినేవాళ్ళకు.

 

తాజాగా చంద్రబాబు చేసిన డిమాండ్లు వింటుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ చంద్రబాబు చేసిన డిమాండ్ ఏమిటయ్యా అంటే కరోనా వైరస్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులు ఏర్పాటు చేయాలంటున్నాడు. తానుంటున్నది చైనాలో కాదని ఇండియాలో అన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నాడు. ఇప్పటికిప్పుడు కరోనా వైరస్ బాధితుల కోసం ప్రత్యేక ఆసుపత్రులు  ఏర్పాటు చేయటం సాధ్యంకాదన్న కనీస ఇంగితం కూడా కోల్పోయాడు. ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేసిన విషయం చంద్రబాబుకు తెలీదేమో.

 

విదేశాల నుండి ఇప్పటికే 15 వేలమంది వచ్చారని తానేదో కనుక్కున్నట్లుగా చెప్పాడు. ఈ విషయాన్ని ప్రభుత్వమే ప్రకటించింది. అందరికీ స్క్రీనింగ్ పరీక్షలు జరుపుతున్నట్లు కూడా ప్రభుత్వం చెప్పింది. విదేశాల నుండి వచ్చిన వారికి క్వారంటైన్ ఏర్పాటు చేయాలనే డిమాండే విచిత్రంగా ఉంది. విదేశాల నుండి వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉండాలంటూ ప్రభుత్వమే నాలుగు రోజులుగా చెబుతున్న విషయాన్నే చంద్రబాబు తాజాగా డిమాండ్ చేయటంలో అర్ధమే లేదు.

 

అలాగే  వార్డుల్లో పారిశుధ్యం పనులు చేయాలని సూచించటమే విచిత్రంగా ఉంది.  ఈ విషయంలోనే కదా పరిసరాల పరిశుభ్రతకు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని జగన్ చెప్పింది. జగన్ చెప్పినపుడు ఎగతాళి చేసిన ఇదే చంద్రబాబు మళ్ళీ ఇపుడు అదే డిమాండ్ చేస్తున్నాడు. పేదలకు రెండు నెలలకు సరిపడా సరుకులు ఇవ్వాలని, ప్రతి పేద కుటుంబానికి తక్షణసాయంగా రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్ కూడా పనికిమాలిన డిమాండే.

 

ఎలాగంటే ఉద్దేశ్యపూర్వకంగా జగన్ ను ఇబ్బంది పెట్టటానికి చంద్రబాబు ఈ డిమాండ్లు చేస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిపోతోంది. లేకపోతే నిత్యావసరాల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ రెండు రోజుల క్రిందట చెప్పిన ప్రకటననే ఇపుడు సూచనగా చంద్రబాబు చెప్పటంలో అర్ధమే లేదు. ఓడిపోయినా ప్రజా సంక్షేమం కోసం జగన్ కన్నా తానే ఎక్కువగా తపన పడుతున్నాను అనే ఓవర్ యాక్షనే చంద్రబాబు మాటల్లో కనబడుతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: