ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పదికి చేరింది. నిన్నటి వరకూ 8 పాజిటివ్ కేసులు ఉండగా.. తాజాగా గుంటూరు, విజయవాడ ప్రభుత్వాసుపత్రుల్లో ఒక్కొక్కటి వంతున కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా 13 కేసుల రిపోర్టులు రావాల్సిఉంది.

దేశంలోని అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందనే చెప్పాలి. అయితే అనుమానుల సంఖ్య వేలల్లో ఉండటం ఆందోళన కలిగించే అంశం.

 

 

ఇక తాజాగా నమోదైన కేసుల విషయానికి వస్తే.. ఈనెల 20న వాషింగ్టన్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ ఆంధ్రా యుకుడు అక్కడ ప్రభుత్వాసుపత్రిలో చేరి మరునాడే డిశ్చార్జ్ అయ్యచారు. ఆ తర్వాత విమానంలో విజయవాడకు వచ్చాడు. తాజాగా కరోనా లక్షణాలు బయటపడటంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేరారు. పరీక్ష చేస్తే కరోనా పాజిటివ్‌ వచ్చింది.

 

 

మరో కేసు ఏంటంటే.. రాష్ట్రం నుంచి ఓ మత పరమైన కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లిన వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. ఆయన మరో 20 మందితో కలిసి రైళ్లో విజయవాడ వచ్చారు. ఇప్పుడు ఆయనకు పాజిటివ్ అని తేలడంతో ఆయనతో పాటు రైళ్లో వచ్చిన వారిని గుర్తిస్తున్నారు.

ఇలా ఒకరి నుంచి మరొకరికి ఎంత మందికి ఈ మహమ్మారి వ్యాపించిందో అన్న ఆందోళన కలిగిస్తోంది. ఇక కరోనా పాజిటివ్‌ లు ఎక్కువగా నమోదైన విశాఖలో మాత్రం కొత్తగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం ఊరట కలిగిస్తోంది. జనం కూడా ఇప్పుడు కాస్త కంట్రల్‌లోకి వచ్చారు. స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: