దేశంలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 649కు చేరింది. వీరిలో 12 మంది మృతి చెందారు. 45 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పోలీసులు అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై లాఠీఛార్జ్ చేస్తున్నారు. 
 
వాహనాలను సీజ్ చేసి ఆకతాయిలపై కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో అత్యవసరాల కోసం బయటకు వెళ్లినవారు తప్పనిసరిగా సామాజిక దూరం పాటిస్తున్నారు. దుకాణాల యజమానులు మూడు మీటర్ల దూరంలో వినియోగదారులు నిలబడే విధంగా ఏర్పాట్లు చేశారు. ఒకరినొకరు తాకకుండా నిబంధనలు పాటిస్తూ ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. 
 
కరోనాను కట్టడి చేయడానికి వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారు. రేయింబవళ్లు వీరు కరోనా నివారణ కోసం సేవలందిస్తూ ఉన్నారు. పోలీసులు లాక్ డౌన్ నిర్వహణలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కరోనా కట్టడి కోసం నిబంధనలు పక్కాగా అమలు జరిగేలా చేస్తున్నారు. 
 
లాక్ డౌన్ నేపథ్యంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి అత్యవసర సేవలు మినహా ఇతర సేవలను నిలిపివేస్తున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే పోలీసులు ప్రజలకు అనుమతి ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతూ ఉండటంతో న్యూస్ పేపర్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. న్యూస్ పేపర్ల ఏజెన్సీలు అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో ఆందోళన చెందుతున్నాయి. న్యూస్ పేపర్లతో కరోనా వ్యాప్తి చెందదని ప్రచారం జరుగుతున్నా ప్రజలు మాత్రం వార్తా పత్రికలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపటం లేదు.                  

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: