విదేశీయుల వల్లనే భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచంలో కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతున్న వేళ విదేశీయులు మన దేశంలోకి లక్షల సంఖ్యలో ప్రవేశించారు. ఐతే మనదేశంలోని విమానాశ్రయాలు వద్ద కరోనా టెస్ట్ లు అంతంత మాత్రానే జరగడం వలన కోవిడ్ 19 వ్యాధి ఉన్నవారు కూడా పట్టుబడలేదు. ఒక సంఘటన గురించి తెలుసుకుంటే... మార్చి 9వ తేదీన ఇండోనేషియా దేశం నుండి ఓ పదిమంది వ్యక్తులు మన ఇండియా లోని ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. అయితే అప్పటికే వారిలో కొందరు జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మన డాక్టర్లు నిర్వహిస్తున్న కరోనా టెస్ట్ లలో పట్టుబడకూడదని, ఆసుపత్రి లో ఎట్టిపరిస్థితులలో జాయిన్ అవ్వకూడదని భావించిన ఆ పదిమంది విమానం దిగకముందు, దిగిన తర్వాత కూడా నాలుగైదు పారాసెటమాల్ మాత్రలను వేసుకున్నారు. దాంతో కరోనా టెస్టులలో వారు పట్టుబడలేదు.



అలా తప్పించుకున్న ఈ విదేశీ కరోనా రోగులు ఢిల్లీ మొత్తం తమ ఇష్టారాజ్యంగా తిరిగారు. తరువాత మార్చి 13వ తేదీన సంపర్క్ క్రాంతి ఎక్సప్రెస్ ట్రైన్ ఎక్కి 14 వ తేదీన రామగుండంలోకి ప్రవేశించారు. తరువాత రామగుండం లోని మత పెద్దలతో కాసేపు సమయం గడిపి అనంతపురం ఒక ప్రైవేటు వాహనం మాట్లాడి అందులో కరీంనగర్ జిల్లా కి వెళ్ళిపోయారు. అలా వెళ్లిన వెంటనే వారిలోని ఒకరికి తీవ్రమైన దగ్గు రావడం ప్రారంభమైంది. దాంతో చేసేదేమీ లేక ఎట్టకేలకు వారు ఓ ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడి డాక్టర్లు దగ్గుతున్న వ్యక్తికి పరీక్షలు చేయగా... అతనికి కరోనా ఉందని అని నిర్ధారణ అయింది.




అతనితో పాటు వచ్చిన వారికి కూడా టెస్టులు చేయగా వారికి కూడా కరోనా వైరస్ సోకిందని తేలింది. దాంతో ఏపీ పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తమై ఈ ఇండోనేషియా వాసులు ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నారో వారి కోసం వెతకడం ప్రారంభించారు. అయితే వీరితో పాటు ఇద్దరు గైడ్లు కాంటాక్ట్ లో ఉన్నారని... అలాగే వీరు ప్రయాణించిన ఎస్ 9 బోగీలో 82 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ఆ భారతీయ ప్రయాణికుల లో కొందరు గద్వాల, కర్నూలు, తిరుపతి ఇంకా ఇతర ప్రాంతాల్లో దిగినట్టు గుర్తించారు పోలీసులు. ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సీరియస్ గా తీసుకొని... రామగుండం పోలీసు కమిషనర్‌ వి.సత్యనారాయణ, కరీంనగర్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి లను దీనిపై శ్రద్ధ చూపించమని ఆదేశించారు.



ఐతే ప్రస్తుతం ఈ రెండు కమిషనరేట్స్ పరిధిలలో 300 మందిని స్వీయ నిర్బంధంలోకి వెళ్లమని ఆదేశించి... 130 మందిని ఐసోలేషన్ వార్డుల కి తరలించారు. అలానే ఎస్9 భోగిలో ఇండోనేషియా వాసులతో పాటు ప్రయాణించిన ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా క్వారంటైన్ లో ఉంచారు. అయితే ఇండోనేషియావాసులని కరీంనగర్ తీసుకెళ్లిన ప్రైవేటు వాహనం డ్రైవర్ క్వారంటైన్ లో ఉండేందుకు నిరాకరించగా అతనిపై కేసు నమోదు చేసి మరీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు పోలీసులు. ఇంకా ఇతరులను పట్టుకునే ప్రయత్నంలో కూడా పోలీసులు ఉన్నారు. అయితే 14 రోజులు గడిస్తే ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న వారికి కరోనా ఉందో లేదో తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: